Tirumala Rush: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. దర్శనానికి 48 గంటల సమయం..

ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. శ్రీవారి క్షేత్రంలో అనూహ్య రద్దీ వల్ల తిరుమల యాత్రకు వచ్చే భక్తులు పునరాలించుకోవాలని టీటీడీ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Tirumala Rush: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. దర్శనానికి 48 గంటల సమయం..
Tirumala Rush
Follow us

|

Updated on: Oct 08, 2022 | 1:49 PM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈరోజు పవిత్రమైన పెరటాసి మాసంలోని మూడో శనివారం కారణంగా తమిళ భక్తులు తిరుమలకొండకు భారీగా తరలి వస్తున్నారు. వరుస సెలవుల కారణంగా అశేష సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుండి 6 కి.మీ మేర క్యూలైన్లు నిండిపోయాయి. వైకుంఠంలోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోగా నారాయణగిరిలోని 9 షెడ్లు ఫిల్ అయ్యాయి. గోగర్భం సర్కిల్ వద్ద భక్తులను క్యూలైన్ లోకి అనుమతిస్తోంది టీటీడీ.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో ఉన్న భక్తులకు అల్పాహారం, మంచినీటిని టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. శ్రీవారి క్షేత్రంలో అనూహ్య రద్దీ వల్ల తిరుమల యాత్రకు వచ్చే భక్తులు పునరాలించుకోవాలని టీటీడీ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరోవైపు కొండమీద భక్తులు వసతి కోసం అవస్థలు పడుతున్నారు. గదులు ఖాళీ లేకపోవడంతో భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. కొండపై ఉన్న యాత్రికుల వసతి సముదాయాలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఇదే విధంగా మరో 4 రోజుల పాటు ఉండనున్నదని టీటీడీ అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా శుక్రవారం రోజున శ్రీవారిని 70,007 మంది భక్తులు దర్శించుకున్నారు. ఒక్కరోజులో రూ.4.25 కోట్లు శ్రీవారి హుండీ ఆదాయం లభించింది, 42,866 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

ఇంద్రకీలాద్రి: 

మరోవైపు అమ్మవారి ప్రముఖ క్షేత్రం ఇంద్రకీలాద్రి పై కూడా భక్తుల రద్దీ నెలకొంది. వీకెండ్స్ కావడంతో ఒక్కసారిగా పెరిగిన భక్తుల తాకిడి నెలకొంది. దుర్గమ్మ నామ స్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంది. భవానీ మాల ధారణ భక్తులు కనక దుర్గమ్మ దర్శనానికి పోటెత్తారు. శుక్రవారం ఒక్క రోజే సుమారు 70 వేల మంది భక్తుల దుర్గమ్మ దర్శనాలు చేసుకున్నారు. క్యూలైన లో అమ్మవారి దర్శనం కోసం భక్తులు గంటల సమయం ఎదురుచూస్తున్నారు. సోమవారం వరకు ఇదే రద్దీ కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles