AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cough Syrup: డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులుతీసుకుంటున్నారా.. అయితే ఈ వ్యాధులకు వెల్కమ్ చెప్పినట్లే అంటోన్న నిపుణులు

వైద్యుల సలహా లేకుండా రోగికి కొన్ని రకాల మందులు ఇవ్వవద్దని డాక్టర్ పంకజ్ సూచిస్తున్నారు.  ఎందుకంటే శరీరానికి చాలా హాని కలిగించే అనేక మందులు ఉన్నాయి..

Cough Syrup: డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులుతీసుకుంటున్నారా.. అయితే ఈ వ్యాధులకు వెల్కమ్ చెప్పినట్లే అంటోన్న నిపుణులు
Cough Syrup
Surya Kala
|

Updated on: Oct 08, 2022 | 7:24 AM

Share

Cough Syrup: కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత..  ఔషధాలకు డిమాండ్ పెరగడంతో పాటు..  వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. ఏ చిన్న వ్యాధులు వచ్చినా..  తేలికపాటి జ్వరం లేదా దగ్గు ..  జలుబు ఇలా చిన్న చిన్న రోగాలకు కూడా వెంటనే మందులను తీసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నాడు. నివారణ కోసం మెడికల్ స్టోర్‌కు వెళ్లి మందులను తెచ్చుకుంటాడు. మెడికల్ షాప్ లో చాలా మందులు అందుబాటులో ఉన్నందున.. ఎక్కువ మంది వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా చాలా రకాల మందులు,  యాంటీబయాటిక్‌లను సులభంగా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇలా మెడిసిన్స్ కొనుగోలు చేయడం ప్రాణాంతకం అని కూడా ఎప్పటి నుంచో వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరైన కారణం లేకుండా మందులు తీసుకోవడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ తో పాటు అనేక రకాల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇది యాంటీబయాటిక్ నిరోధకతకు కూడా దారితీస్తుంది. ఇది ప్రమాదకర పరిస్థితి.

ఈ విషయమై వైశాలి మ్యాక్స్ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ విభాగం డాక్టర్ పంకజ చౌదరి Tv9 భరతవర్ష్‌తో మాట్లాడారు. కారణం లేకుండా మందులు తీసుకోవడం వల్ల ప్రజలు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ బారిన పడుతున్నారని అన్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న  చాలా మంది రోగులు తన వద్దకు వస్తున్నారని చెప్పారు. యాంటీబయాటిక్ నిరోధకత కారణంగా, మందులు శరీరంలో వ్యాధిని కలిగించే బ్యాక్టీరియాపై ప్రభావం చూపవని తెలిపారు.

శరీరంలో ఉండే బాక్టీరియా పదే పదే మందులను తీసుకోవడం ద్వారా ఔషధాలకు వ్యతిరేకంగా తమ రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం వల్ల ఇది జరుగుతుంది. క్రమంగా మెడిసిన్స్  రోగాల నివారణపై పని చేయడం మానేస్తాయని..  అటువంటి పరిస్థితిలో, రోగికి చికిత్స చేయడం సవాలుగా మారుతుందన్నారు.

ఇవి కూడా చదవండి

రెగ్యులేటరీ బాడీలు కౌంటర్‌లో మందులకు సంబంధించి చట్టాలను రూపొందించాలని డాక్టర్ పంకజ్ కోరుతున్నారు.  వైద్యుల సలహా లేకుండా రోగికి కొన్ని రకాల మందులు ఇవ్వవద్దని డాక్టర్ పంకజ్ సూచిస్తున్నారు.  ఎందుకంటే శరీరానికి చాలా హాని కలిగించే అనేక మందులు ఉన్నాయి.. అయితే మెడికల్ స్టోర్‌లో ఇలాంటి మెడిసిన్స్ చాలా సులభంగా లభిస్తున్నాయి. చాలా మంది ప్రిస్క్రిప్షన్ లేకుండా కొన్ని ఇంజెక్షన్లు లేదా దగ్గు సిరప్‌లను కొనుగోలు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది.

మూత్రపిండాలపై ప్రభావం: ఔషధాల వల్ల వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఆ ఔషధాన్ని ఎక్కువ మోతాదులో తీసుకున్నా.. లేదా శరీర తత్వానికి సరిపడని మందులు తీసుకున్నా కిడ్నీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని సీనియర్ వైద్యుడు డాక్టర్ అజయ్ సింగ్ వివరిస్తున్నారు. ఒక వ్యక్తి చాలా కాలం పాటు వైద్యుల పర్యవేక్షణ లేకుండా మందులు తీసుకుంటే, చాలా సందర్భాలలో మూత్రపిండాల వైఫల్యం, తీవ్రమైన అలెర్జీలు కూడా వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ రోజుల్లో తేలికపాటి జ్వరం లేదా తలనొప్పి వచ్చినప్పుడు ప్రజలు యాంటీబయాటిక్స్ తీసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. చాలా మంది ప్రజలు ఈ మందులను ఎల్లప్పుడూ తమ వద్ద ఉంచుకుంటారు. కొంచెం ఇబ్బంది ఏర్పడితే చాలు వెంటనే పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం ప్రారంభిస్తారు. ఇలా చేయడం ఒకొక్కసారి ప్రాణాపాయానికి కారణం కూడా అవుతుందని.. కనుక పెయిన్ కిల్లర్స్ ను వైద్యుల సలహాతో మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.

తలనొప్పి, జలుబు లేదా కడుపునొప్పి ఉంటే వైద్యుల సలహా లేకుండా మెడిసిన్స్ ఎప్పుడూ తీసుకోకూడదని డాక్టర్ సింగ్ చెప్పారు. ఎందుకంటే ఈ సమస్యలలో చాలా సార్లు డ్రగ్ రియాక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఇది ప్రాణాంతకం కూడా కావచ్చున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..