Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మధుమేహ రోగికి టిఫిన్ గా పోహా లేదా ఇడ్లీ ఏది మంచిది? వాటిలోని పోషక విలువలను తెలుసుకోండి

చాలా మంది అల్పాహారంగా ఇడ్లీని కూడా తీసుకుంటారు. అయితే ఈ రెండింటిలోని పోషక విలువలను పోల్చి చూస్తే, బ్రేక్‌ఫాస్ట్‌కు ఏది బెటర్ ఆప్షన్ ఈరోజు తెలుసుకుందాం.. 

Health Tips: మధుమేహ రోగికి టిఫిన్ గా పోహా లేదా ఇడ్లీ ఏది మంచిది? వాటిలోని పోషక విలువలను తెలుసుకోండి
Break Fast Tips
Follow us
Surya Kala

|

Updated on: Sep 24, 2022 | 8:13 PM

Breakfast Health Tips: హడావిడి జీవతంలో పని ఒత్తిడి కారణంగా చాలామంది ఉదయం అల్పాహారం తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఇది  ఆరోగ్యానికి చాలా హానికరమని పోషకాహార నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే అల్పాహారంగా చాలా రకాల రకాల పదార్ధాలను తీసుకుంటాం.. కానీ పోహా అంటే అటుకులతో చేసిన టిఫిన్ తీసుకోవడం గొప్ప ఎంపిక. మధుమేహంతో బాధపడే వారికి ఇది చాలా మేలు చేస్తుంది. అటుకులు గ్లూటెన్ తో పాటు  కొవ్వు రహితమైనవి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. అయితే చాలా మంది అల్పాహారంగా ఇడ్లీని కూడా తీసుకుంటారు. అయితే ఈ రెండింటిలోని పోషక విలువలను పోల్చి చూస్తే, బ్రేక్‌ఫాస్ట్‌కు ఏది బెటర్ ఆప్షన్ ఈరోజు తెలుసుకుందాం..

అటుకులతో చేసిన పోహా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు పోహాలో 70 శాతం ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇందులో 30 శాతం కొవ్వు తో పాటు ఫైబర్ ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఫైబర్ చక్కెరను నెమ్మదిగా..  క్రమంగా రక్తప్రవాహంలోకి విడుదల చేస్తుంది. దీంతో రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరగడాన్ని నిరోధిస్తుంది. కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల నీరసం తొలగిపోతుంది. మీరు రోజంతా శక్తివంతంగా ఉంటారు. కనుక ఇడ్లీ కంటే పోహా తినడం మంచిది.

ఇడ్లీ , పోహా రెండూ ప్రోబయోటిక్స్. విటమిన్ బి కూడా వీటిలో పుష్కలంగా ఉంటుంది. ఇడ్లీతో పోలిస్తే పోహాలో ఐరన్ , కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇడ్లీతో పోలిస్తే అతుకుల్లో చాలా తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. శనగలు,  క్యాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్, కొత్తిమీర కూడా పోహా చేయడానికి ఉపయోగిస్తారు. అందువల్ల.. దీనిలో పోషక విలువ మరింత పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది పోహ చాలా తేలికగా జీర్ణమవుతుంది. దీనిని ఉదయం, సాయంత్రం అల్పాహారంలో తీసుకోవచ్చు. దీన్ని తీసుకోవడం ద్వారా, మీరు చాలా కాలం పాటు కడుపు నిండిన అనుభూతిని పొందుతారు. కడుపు ఉబ్బరం సమస్యను నివారిస్తుంది. చాలా తక్కువ మొత్తంలో కేలరీలను కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్ , యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి.  మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. పోహను మనం అనేక రకాలుగా తినవచ్చు. మీరు పెరుగుతో పోహా తినవచ్చు, మీరు పోహా ఉప్మా తినవచ్చు. అంతేకాదు.. కొన్ని ప్రాంతాల్లో పోహాతో  పరాటాలు కూడా చేస్తారు.

(ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ పాఠకుల ఆసక్తిని అనుసరించి ఇచ్చింది. TV9 తెలుగు వీటిని ధృవీకరించలేదు. నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని అనుసరించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..