AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adults Diet Tips: పెరుగుతున్న వయసుకు అనుగుణంగా తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి .. వృద్ధాప్యంలో కూడా బలంగా ఉంటారు

చాలా మంది పెరుగుతున్న వయసుకు అనుగుణంగా డైట్‌లో ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో తెలియని అయోమయంలో ఉంటారు. ఆరోగ్యంగా ఉండేందుకు మీరు ఏయే ఆహారాలను డైట్‌లో చేర్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Adults Diet Tips: పెరుగుతున్న వయసుకు అనుగుణంగా తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి .. వృద్ధాప్యంలో కూడా బలంగా ఉంటారు
Health Tips For Adults
Surya Kala
|

Updated on: Sep 19, 2022 | 7:26 PM

Share

Adults Diet Tips: వయసు పెరిగే కొద్దీ శరీరంలో బలహీనత మొదలవుతుంది. అటువంటి పరిస్థితిలో జీవనశైలిలో మార్పులు  చేసుకోవాలి. మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి పరిస్థితిలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినే ఆహారంలో చేర్చుకోవచ్చు. వయసుకు తగిన విధంగా తినే ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. అయితే చాలా మంది తమ డైట్‌లో ఎలాంటి ఫుడ్స్‌ను చేర్చుకోవాలో తెలియని అయోమయంలో ఉంటారు. ఆరోగ్యంగా ఉండేందుకు మీరు ఏయే ఆహారాలను డైట్‌లో చేర్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగు: పెరుగులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో మంచి బ్యాక్టీరియా, కాల్షియం ఉంటుంది. అంతేకాదు జింక్, విటమిన్ బి, ప్రోబయోటిక్స్, విటమిన్ డి వంటి పోషకాలు ఉంటాయి. ఎముకలు దృఢంగా తయారవుతాయి. పెరుగుతున్న వయస్సుతో పాటు కీళ్ల నొప్పుల సమస్య తరచుగా వేధిస్తూ ఉంటుంది.  అటువంటి పరిస్థితిలో కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తినడం మేలు చేస్తుంది.

గుడ్లు:  గుడ్లు సమతుల్య ఆహారం. అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ ప్రొటీన్ అవసరం కూడా శరీరానికి పెరుగుతుంది. ఈ గుడ్లను రకరకాల రూపంలో తీసుకోవచ్చు. గుడ్లను ఉడకబెట్టి లేదా ఆమ్లెట్ ఇలా రకరకాల రూపంలో తీసుకోవచ్చు. గుడ్లు శక్తిని అందిస్తాయి. ఎముకలు దృఢంగా తయారవుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

చేప చేపలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షణగా పనిచేస్తుంది. మెదడు చురుకుగా ఉండేలా చేసి.. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. కంటి చూపును మెరుగుపరచడంలో చేపలు సహాయపడతాయి.

ఫైబర్ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మీరు ఆహారంలో అనేక రకాల కూరగాయలు, పండ్లు, పప్పులను చేర్చుకోవచ్చు. ఫైబర్స్ జీర్ణ సంబంధిత సమస్యల నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడతాయి. పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎక్కువ కాలం కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచేందుకు ఇది పనిచేస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ సమస్య నుండి రక్షించడానికి పనిచేస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ పాఠకుల ఆసక్తిని అంచనాల ఆధారంగా ఉంది. TV9 తెలుగు వీటిని ధృవీకరించలేదు. ఇక్కడ ఇచ్చిన సూచనలను ఆచరించాలంటే.. నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని వీటిని అనుసరించాలి.)