TB Vaccine: TB నిర్మూలనకు IISc కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి.. పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి 5 ఏళ్ల సమయం

భారత వైద్య రంగం క్షయవ్యాధి నిర్ములనకు సరికొత్త ఆవిష్కరణ దిశగా ఆడుగులు వేసింది. IISc కొత్త TB వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసింది. అయితే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి 5 సంవత్సరాలు పడుతుందని వ్యాధి నిపుణులు చెబుతున్నారు. 

TB Vaccine: TB నిర్మూలనకు IISc కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి.. పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి 5 ఏళ్ల సమయం
Iisc Develops New Tb Vaccin
Follow us
Surya Kala

|

Updated on: Sep 17, 2022 | 3:08 PM

TB Vaccine: “ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి.. క్షయ వ్యాధి.. ఇది అంటువ్యాధి. మనదేశంలో దీర్ఘకాలిక రోగాలలో ప్రధానమైనది ఈ క్షయవ్యాధి. ఈ వ్యాధి ప్రధానంగా శ్వాసకోశాన్ని దెబ్బ తీస్తుంది. ఈ క్షయవ్యాధి నిర్మూలనకు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) పరిశోధకులు కొత్త వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడడానికి మరిన్ని క్లినికల్ ట్రయల్స్ చేయాల్సి ఉందని.. మరో ఐదేళ్లకు వ్యాక్సిన్ పూర్తి స్తాయిలో అందుబాటులోకి రానున్నదని పరిశోధకులు తెలిపారు. బంగారు నానోపార్టికల్స్‌పై పూసిన బ్యాక్టీరియా ద్వారా స్రవించే గోళాకార వెసికిల్స్‌ను ఉపయోగించారు. వీటిని రోగనిరోధక కణాలకు పంపిణీ చేయవచ్చు. కొత్త వ్యాక్సిన్ రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించగలదని, క్షయవ్యాధి నుండి రక్షణను అందించగలదని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు .

అంటు వ్యాధి నిపుణుడు డాక్టర్ ఈశ్వర్ గిలాడా మాట్లాడుతూ.. “క్షయవ్యాధి నిర్మూలనకు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ సిద్ధాంతం మంచిదే అయినప్పటికీ, వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయడానికి సంవత్సరాలు పడుతుందని అన్నారు. కొత్త పరిశోధన సాంప్రదాయకానికి భిన్నమైన వ్యాక్సిన్ అభ్యర్థి చేసినట్లు తెలిపారు.  సాంప్రదాయ BCG వ్యాక్సిన్ .. కంటే ఇది మరింత సమర్ధ వంతంగా పనిచేస్తుందని.. క్షయ వ్యాధి వ్యాప్తి నివారించే విధంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఇది కేవలం ఒక సిద్ధాంతం కాబట్టి, ప్రస్తుతానికి, “వ్యాక్సిన్ భద్రత, సమర్థతను నిరూపించడానికి ఐదు-ఏడేళ్లు మంచి సమయం పడుతుంది” అని ఆయన అన్నారు. ఈ టీకా ట్రయల్స్ కోసం చాలా సమయం పడుతుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

కొత్త టీకా సెంటర్ ఫర్ బయోసిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (BSSE)లో అసిస్టెంట్ ప్రొఫెసర్ రచిత్ అగర్వాల్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం కొత్త వ్యాక్సిన్ అభ్యర్థిని అభివృద్ధి చేసింది. సబ్యూనిట్ వ్యాక్సిన్ అభ్యర్థి రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించడానికి ఇన్ఫెక్షియస్ బాక్టీరియా భాగాలను మాత్రమే కలిగి ఉంటుంది. ఈ  పరిశోధన ఫలితాలు బయోమెటీరియల్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురించబడ్డాయి. “లైవ్ బాక్టీరియంతో పోలిస్తే అవి సురక్షితమైనవి, అవి పొర-ఉత్పన్నం కాబట్టి, అవి అన్ని రకాల యాంటిజెన్‌లను కలిగి ఉంటాయి” అని సీనియర్ రచయిత అగర్వాల్ వివరించారు.

పరిశోధన బృందం ఔటర్ మెంబ్రేన్ వెసికిల్స్ (OMVలు), కొన్ని బ్యాక్టీరియా ద్వారా విడుదలయ్యే గోళాకార పొర-బంధిత కణాలను ఉపయోగించింది. ఇవి  వ్యాధికారకానికి వ్యతిరేకంగా రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించగల ప్రోటీన్లు, లిపిడ్‌ల కలిగి ఉన్నాయి.  IISc ఒక ప్రకటనలో సబ్యూనిట్ వ్యాక్సిన్‌లు సాధారణంగా పరిమిత సంఖ్యలో యాంటిజెన్‌ల బ్యాక్టీరియా ప్రోటీన్‌లను కలిగి ఉంటాయి. ఇవి హోస్ట్‌లో రోగనిరోధక ప్రతిస్పందనను పొందగలవు. OMV లు వివిధ రకాల యాంటిజెన్‌లను కలిగి ఉంటాయని.. తద్వారా మెరుగైన రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తాయని పరిశోధకులు తెలిపారు.

మైకోబాక్టీరియం-ఉత్పన్నమైన OMVలు అస్థిరంగా ఉన్నప్పటికీ, బంగారు నానోపార్టికల్స్‌పై పూసిన OMVలు పరిమాణంలో స్థిరంగా ఒకేరకంగా ఉన్నట్లు కనుగొనబడ్డాయి. “మానవ రోగనిరోధక కణాలు OMVలు లేదా బంగారు నానోపార్టికల్స్ కంటే OMV-AuNPలను ఎక్కువగా తీసుకుంటాయని” పరిశోధకులు పేర్కొన్నారు.

100 nm ఫిల్టర్ ద్వారా OMV-AuNPని సంశ్లేషణ చేయడానికి పరిశోధకులు OMVలు బంగారు నానోపార్టికల్స్‌ను ఇంజెక్ట్ చేశారు. వారు అప్పుడు మానవులలో వ్యాధిని కలిగించని సంబంధిత బ్యాక్టీరియా జాతి అయిన మైకోబాక్టీరియం స్మెగ్మాటిస్ నుండి తీసుకోబడిన OMVలతో ప్రయోగశాలలో కల్చర్ చేయబడిన రోగనిరోధక కణాలకు చికిత్స చేశారు. ఈ బృందం ఇప్పుడు మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ నుండి నేరుగా పొందిన బంగారు పూతతో కూడిన OMVలను అభివృద్ధి చేయాలని, క్లినికల్ అప్లికేషన్‌ల కోసం ఫలితాలను ముందుకు తీసుకెళ్లడానికి జంతువుల నమూనాలపై వాటిని పరీక్షించాలని యోచిస్తోంది.

ప్రస్తుతం ఉపయోగిస్తున్న వ్యాక్సిన్:  ప్రపంచవ్యాప్తంగా 25 శాతం మంది ప్రజలు తేలికపాటి TB లక్షణాలను కలిగి ఉన్నారని డాక్టర్ గిలాడా వెల్లడించారు. వారిలో కొద్ది శాతం మంది మాత్రమే TB రోగికి సంబంధించినవారని పేర్కొన్నారు. “భారతదేశంలో 40 శాతం మంది వ్యక్తులు తేలికపాటి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు.  అయితే ఈ 40 శాతం మంది వ్యక్తుల్లో ఐదు శాతం నుండి 10 శాతం మందిలో మాత్రమే తీవ్రమైన వ్యాధి లక్షణాలు కలిగి ఉన్నారని చెప్పారు.

ఇప్పటివరకు, TBతో పోరాడటానికి భారతదేశం Bacille Calmette-Guerin (BCG) లైవ్ వ్యాక్సిన్‌ని ఉపయోగిస్తోంది. ఇది వ్యాధిని కలిగించే బాక్టీరియం   బలహీనమైన రూపాన్ని కలిగి ఉంటుంది. మన రక్తంలోకి ఇంజెక్ట్ చేసినప్పుడు.. ఈ వ్యాక్సిన్ క్షయ వ్యాధితో పోరాడటానికి సహాయపడే ప్రతిరోధకాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.

అయితే టీబీ స్థానిక దశలో ఉన్న దేశాల్లో మాత్రమే బీసీజీ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని.. ఉదాహరణకు భారత్‌లో మాత్రమే ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని నిపుణులు తెలిపారు.  BCG వ్యాక్సిన్‌ల సమర్థత స్థాయి తక్కువగా ఉన్నందున US వంటి దేశాలు ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ను ఉపయోగించడం మానేశాయి. BCG వ్యాక్సిన్ క్షయవ్యాధికి వ్యతిరేకంగా పోరాడే సామర్ధ్యం.. 35 శాతం నుండి 40 శాతం మాత్రమే కలిగి ఉంటుంది. (Source)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!