AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: అలసటగా ఉన్నా విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారా.. జాగ్రత్తలు తీసుకోకుంటే పెను ప్రమాదం తప్పదు

ప్రస్తుత కాలంలో లైఫ్ స్టైల్ (Life Style) మారిపోయింది. సమయం చాలా విలువైనదిగా తయారైంది. టైమ్ కు తగ్గట్లు ప్లాన్స్ వేసుకుని పనులు చేస్తున్నారు. ఆఫీస్ వర్క్, ఇంటి పని ఇలా వాటికి టైమ్ కేటాయిస్తూ పని పూర్తి..

Health: అలసటగా ఉన్నా విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారా.. జాగ్రత్తలు తీసుకోకుంటే పెను ప్రమాదం తప్పదు
Long Working Hours
Ganesh Mudavath
|

Updated on: Sep 17, 2022 | 1:49 PM

Share

ప్రస్తుత కాలంలో లైఫ్ స్టైల్ (Life Style) మారిపోయింది. సమయం చాలా విలువైనదిగా తయారైంది. టైమ్ కు తగ్గట్లు ప్లాన్స్ వేసుకుని పనులు చేస్తున్నారు. ఆఫీస్ వర్క్, ఇంటి పని ఇలా వాటికి టైమ్ కేటాయిస్తూ పని పూర్తి చేస్తుంటాం. ఇలా బిజీబిజీగా పని చేస్తున్న సమయంలో కొన్ని సార్లు అలసిపోతాం. అయినప్పటికీ వర్క్ (Work) పెండింగ్ లో ఉందనే భావనతో చాలా మంది విశ్రాంతి తీసుకోకుండా పని చేస్తుంటారు. అయితే ఇలా చేయడం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గంటల పాటు విరామం లేకుండా పని చేయడం వల్ల మెదడులోని ప్రిఫ్రంటల్ కార్టెక్స్ విష రసాయనాలను విడుదల చేస్తుందని నిపుణులు గుర్తించారు. అలసట అనేది నిర్ణయాలపై ప్రభావం చూపుతంది. పని ప్రారంభించకముందు ఉన్న ఏకాగ్రత.. పని చివరకు వచ్చే దశలో ఉండదు. పారిస్‌లోని పిటీ-సల్పెట్రీయర్ విశ్వవిద్యాలయ పరిశోధకుల సర్వే ప్రకారం.. అలసట అనేది ఒక రకమైన భ్రమ అని, విశ్రాంతి తీసుకునేందుకు మెదడు పంపించే సంకేతమే అలసిపోవడం అని చెబుతున్నారు. పని మధ్యలో లేవకుండా పనిచేస్తే గుండె జబ్బులు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

శారీరక వ్యాయామం లేకపోవడం, గంటలకు గంటలు కూర్చోవడం వల్ల 5.8 శాతం గుండె జబ్బులొస్తున్నాయి. వీటిలో 8.8 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. అందుకే ఎక్కువ సేపు కూర్చోకుండా పని మధ్య మధ్యలో లేచి కాసేపు నడవాలి. ఇది ఎన్నో ప్రమాదకరమైన రోగాలను నివారిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా అర్థ గంటకు లేదా గంట గంటకు లేచి నడవాలి. మొత్తంగా 8 గంటలు కూర్చొని పనిచేస్తే గుండె జబ్బులొస్తాయన్న సంగతిని మర్చిపోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..