Health: చూయింగ్ గమ్ ను మింగేస్తే పేగులకు అతుక్కుంటుందా.. నిపుణుల అధ్యయనంలో షాకింగ్ విషయాలు

చూయింగ్ గమ్ (Chewing Gum).. ఈ పేరు మనందరికీ పరిచయమే. చిన్నప్పుడు చూయింగ్ తింటే పెద్దవాళ్లు తిట్టేవారనో, దాన్ని మింగేస్తే పేగులకు అతుక్కుపోతుందని తెగ భయపడేవాళ్లం. ఎవరికీ తెలియకుండా..

Health: చూయింగ్ గమ్ ను మింగేస్తే పేగులకు అతుక్కుంటుందా.. నిపుణుల అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Chewing Gum
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 17, 2022 | 8:25 AM

చూయింగ్ గమ్ (Chewing Gum).. ఈ పేరు మనందరికీ పరిచయమే. చిన్నప్పుడు చూయింగ్ తింటే పెద్దవాళ్లు తిట్టేవారనో, దాన్ని మింగేస్తే పేగులకు అతుక్కుపోతుందని తెగ భయపడేవాళ్లం. ఎవరికీ తెలియకుండా నమిలేసేవాళ్లం. చూయింగ్ గమ్ నమిలి వాటితో బుడగలు చేసుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్లం. అయితే.. చూయింగ్ గమ్ తినే విషయంపై ఆరోగ్య నిపుణులు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. చూయింగ్ గమ్ నమలడం వల్ల నష్టాలున్నాయా.. లాభాలున్నాయా.. అనే విషయంపై పరిశోధనలు చేసి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. చూయింగ్ గమ్ నమలడం వల్ల కేలరీలు ఖర్చువుతాయి. అది కూడా కేవలం షుగర్ (Sugar) ఫ్రీ చూయింగ్ గమ్ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని చెబుతున్నారు నిపుణులు. షుగర్ ఫ్రీ చూయింగమ్ ను గంట నమిలితే టకు 11 కేలరీలు ఖర్చవుతాయని వెల్లడైంది. అయితే.. వర్కవుట్స్ చేస్తూ చూయింగ్ గమ్ నమలితే ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి. అంతే కాకుండా 40 ఏళ్లు దాటిన వారు చూయింగ్ గమ్ నమలడం వల్ల చాలా ప్రయోజనాలను ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలింది.

చూయింగ్ గమ్ ను పొరపాటున మింగేస్తే.. అది పేగులకు చుట్టుకుపోతుందని చాలా మంది భయపడుతుంటారు. అయితే అది నిజం కాదని, మానవ శరీరం చూయింగ్ గమ్‌ను జీర్ణించుకోలేదని, దాన్ని మింగడం వల్ల పేగులకు ఎటువంటి సమస్య రాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చూయింగ్ గమ్‌లను నమిలి ఊసేయకుండా మింగేస్తే మాత్రం అవి పేగుల్లో ఆటంకాలు సృష్టిస్తాయని చెప్పారు. అయితే.. చూయింగ్ గమ్ లు చాలా వరకు తియ్యగా ఉంటాయి. వాటిలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. చక్కెరతో చేసిన చూయింగ్ గమ్ దంతాలకు హాని కలిగిస్తుంది. ఇది కావిటీలకు దారి తీస్తుంది.

షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ నమలడం వల్ల కేలరీలు ఖర్చవుతాయన్న విషయం తెలిసిందే అయినప్పటికీ.. అది కొద్ది పరిమాణంలో మాత్రమే. ఇది దంతాలను శుభ్రం చేయడమే కాకుండా దవడలకు వ్యాయామం గా ఉపయోగపడుతుంది. అయితే చూయింగ్ గమ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపుబ్బరం సమస్య వచ్చే ప్రమాదం ఉంది. కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి మంట వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ డ్రై ఫ్రూట్‌ చాలా ఖరీదైనది.. ఈ వ్యాపారం చేస్తే లక్షల్లో లాభం!
ఈ డ్రై ఫ్రూట్‌ చాలా ఖరీదైనది.. ఈ వ్యాపారం చేస్తే లక్షల్లో లాభం!
9 ఏళ్లకే సినిమాల్లోకి.. ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు
9 ఏళ్లకే సినిమాల్లోకి.. ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు
అతడు t20ల్లో టీమిండియా మెజీషియన్..
అతడు t20ల్లో టీమిండియా మెజీషియన్..
ఉత్పన్నఏకాదశి రోజున ఈ శుభయోగంలో పూజిస్తే కోరినకోర్కెలు నెరవేరతాయి
ఉత్పన్నఏకాదశి రోజున ఈ శుభయోగంలో పూజిస్తే కోరినకోర్కెలు నెరవేరతాయి
సింపుల్ టీ షర్టే.. కానీ కాస్ట్ తెలిస్తే ఖంగుతినాల్సిందే
సింపుల్ టీ షర్టే.. కానీ కాస్ట్ తెలిస్తే ఖంగుతినాల్సిందే
మహిళలకు అలర్ట్.. శరీరంలో ఈ లక్షణాలను అస్సలు విస్మరించకండి..
మహిళలకు అలర్ట్.. శరీరంలో ఈ లక్షణాలను అస్సలు విస్మరించకండి..
టీమిండియా ఫ్యాన్స్‌కు షాక్.. ఆ స్టార్ ప్లేయర్‌కి గాయం
టీమిండియా ఫ్యాన్స్‌కు షాక్.. ఆ స్టార్ ప్లేయర్‌కి గాయం
కోత్లాపూర్ జ్యోతిబాపులే గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య..
కోత్లాపూర్ జ్యోతిబాపులే గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య..
పీఎం కిసాన్‌ స్కీమ్ రైతులు ఈ పని చేయండి.. లేకుంటే డబ్బులు రావు!
పీఎం కిసాన్‌ స్కీమ్ రైతులు ఈ పని చేయండి.. లేకుంటే డబ్బులు రావు!
పెళ్ళికి ముందు ఈ 3 విషయాలు తప్పని సరిగా తెలుసుకోమంటున్న చాణక్య
పెళ్ళికి ముందు ఈ 3 విషయాలు తప్పని సరిగా తెలుసుకోమంటున్న చాణక్య