Diabetic Heart Attack: మధుమేహం ఉన్న వారికి గుండెపోటు ప్రమాదం.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

Diabetic Heart Attack: ఈ రోజుల్లో గుండెపోటు బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి గుండెపోటు ముప్పు ఉంటుందని ఇప్పటికే వైద్య నిపుణులు..

Diabetic Heart Attack: మధుమేహం ఉన్న వారికి గుండెపోటు ప్రమాదం.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
Diabetic Heart Attack
Follow us
Subhash Goud

|

Updated on: Sep 17, 2022 | 7:30 AM

Diabetic Heart Attack: ఈ రోజుల్లో గుండెపోటు బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి గుండెపోటు ముప్పు ఉంటుందని ఇప్పటికే వైద్య నిపుణులు తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న రోజుల్లో అనారోగ్యం బారినపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, టెన్షన్‌కు గురవడం, ఆహారపు అలవాట్లు, నిద్రలేని తనం తదితర కారణాల వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇక మధుమేహం వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ డయాబెటిస్‌ వల్ల తలెత్తే గుండె సమస్యను డయాబెటిస్‌ హార్ట్‌ డిసీజ్‌ అంటారు. దీని వల్ల గుండెలోని కండరాలు గట్టి పడటం లేదా బలహీనపడటం జరుగుతుందని చెబుతున్నారు. దీనిని బయాబెటిక్‌ కాడియోమయోపతి అంటారు. ఎప్పుడైతే గుడెలోని కండరాలు పని చేయడం ఆగిపోతాయో అప్పుడు గుండెలో ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఊరిపితిత్తుల్లోకి నీరు చేరుతుంది. కొందరికి గుండెకు రక్తం సరఫరా చేసే నరాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. ఈ కారణాల వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

లక్షణాలు లేకుండానే గుండెపోటు..

మధుమేహంతో బాధపడేవాళ్లలో కొంతమందికి ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండా గుండెపోటు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే మధుమేహం ఉన్నవాళ్లు కొత్తగా ఏదైనా సమస్యలు వచ్చినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. దీని వల్ల రక్తపోటు, అధిక బరువు సమస్యలు ఏర్పడతాయంటున్నారు. శరీరంలో మంచి కొవ్వు తగ్గి, చెడు కొవ్వు పెరిగిపోతూ ఉంటుందట. అయితే డయాబెటిస్‌ ఉన్న వాళ్లకు ఈసీజీ, ఎకో కార్డియోగ్రామ్‌, ట్రెడ్‌మిల్‌ టెస్ట్‌ చేయడం ద్వారా గుండెకు సంబంధిత సమస్యలను గుర్తి్స్తారు. అందుకే డయాబెటిస్‌ ఉన్న వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

డయాబెటిస్‌ నుంచి గుండెను ఎలా కాపాడుకోవాలి..?

దీర్ఘకాలికంగా మధుమేహంతో బాధపడుతున్న వాళ్లలో గుండె సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. మధుమేహం ఉన్న వాళ్లలో యుక్త వయసులో కూడా గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవడం, బీపీ, అధిక బరువు పెరుగకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, ఆహారం విషయంలో నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. పాలు, ఇతర తీపి పదార్థాలు తీసుకోకపోవడమే మంచిదంటున్నారు. అంతేకాకుండా జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలని, ప్రతి రోజు వాకింగ్‌ చేస్తుండాలని, ఇలా జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడమే కాకుండా గుండెకు సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చని అంటున్నారు నిపుణులు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే