Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Problems: ఉద్యోగులు నైట్‌ షిప్ట్‌ డ్యూటీ చేస్తున్నారా? అనేక వ్యాధులతో పాటు గుండెపోటు.. అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు

Health Problems: ఎప్పుడైతే ఐటి రంగం ఊపందుకుందో అప్పటి నుంచి ఆడ మగ అనే తేడా లేకుండా ఈ ఐటీ రంగంలో నైట్ డ్యూటీలు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది..

Health Problems: ఉద్యోగులు నైట్‌ షిప్ట్‌ డ్యూటీ చేస్తున్నారా? అనేక వ్యాధులతో పాటు గుండెపోటు.. అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు
Follow us
Subhash Goud

|

Updated on: Sep 14, 2022 | 8:07 PM

Health Problems: ఎప్పుడైతే ఐటి రంగం ఊపందుకుందో అప్పటి నుంచి ఆడ మగ అనే తేడా లేకుండా ఈ ఐటీ రంగంలో నైట్ డ్యూటీలు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఐటీ రంగంలోనే కాకుండా ఇతర సంస్థల్లోనూ నైట్‌షిప్ట్‌ డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. పగలంతా ఖాళీగా ఉండి రాత్రి పని చేయడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని రంగాల్లో షిఫ్ట్ వైజ్‌లో ఉద్యోగం చేస్తుంటారు. నిజానికి షిఫ్ట్ డ్యూటీ చేయడం వల్ల చాలా సమయం మిగులుతుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ అది ఆరోగ్యానికి తీవ్ర నష్టమని తెలుసుకోలేరు.

నేటి కార్పొరేట్ ప్రపంచంలో, ఉద్యోగులు తమ పనిని సకాలంలో పూర్తి చేయడానికి పగలు, రాత్రి కష్టపడుతున్నారు. పోటీ ప్రపంచంలో కంపెనీలు 24X7 పని చేయాలనే ఉద్దేశంతో నైట్‌ డ్యూటీలు కూడా వేస్తున్నాయి. అయితే ఈ షిఫ్టులలో ఎక్కువ కాలం పనిచేసే కార్మికులు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఆరోగ్య సమస్యలతో సక్రమంగా పని చేసేవారు కూడా మాదకద్రవ్యాల దుర్వినియోగానికి గురయ్యే అవకాశం ఉందని న్యూరోసైకియాట్రిస్ట్ డాక్టర్ సంజయ్ చుగ్ హెచ్చరించారు

డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ.. ఉద్యోగులు నైట్ షిఫ్ట్‌లలో పని చేస్తున్నప్పుడు ముఖ్యంగా షిఫ్ట్‌లు క్రమం తప్పకుండా మారుతున్నప్పుడు, అంటే మీరు ఒక వారం నైట్ షిఫ్ట్, తర్వాత వారం డే షిఫ్ట్, ఆపై మరుసటి వారం మధ్యాహ్న షిఫ్ట్ చేయడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని, దీని వల్ల శరీరంలో న్యూరోకెమికల్, హార్మోన్ల మార్పులు వస్తాయని, దీని కారణంగా తీవ్రమైన అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు.

ఇవి కూడా చదవండి

బ్రిటీష్ మెడికల్ జర్నల్‌లో 2012లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. నైట్ షిఫ్ట్‌లో పని చేయడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం 7 శాతం పెరుగుతుందని నిర్ధారించారు. అయితే నిద్ర అలవాట్లలో మార్పులు, రక్తపోటు, రక్త ప్రసరణను ప్రభావితం చేస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు. రాత్రి షిఫ్ట్‌లో పనిచేయడం కూడా మీ మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మీరు నైట్ షిఫ్ట్‌లో పనిచేసేటప్పుడు డిప్రెషన్, మూడ్ డిజార్డర్స్ ముప్పు పెరుగుతుందని చాలా అధ్యయనాలు చూపిస్తున్నాయి. నైట్‌షిప్టులు చేసేవారు పగటి పూట నిద్రలేకపోవడం వల్ల మద్యానికి అలవాటు పడుతుంటారు. ఇది మీ మెదడును పనితీరుపై ప్రభావం పడుతుంది.

నిద్రకు ఆటంకం..

రాత్రి షిఫ్టులో పనిచేయడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఒత్తిడికి గురవుతుంటారు. జీవనశైలికి పూర్తిగా భంగం కలిగిస్తుంది. శరీరంలో సంభవించే ఇతర శారీరక మార్పులు ఒత్తిడితో ముడిపడి ఉంటాయి.

మద్యానికి బానిస కావచ్చు:

నైట్ షిఫ్ట్ కార్మికులు అత్యంత సాధారణ సమస్య నిద్ర లేకపోవడం. ఇది చాలా మంది మద్యం సేవించడం ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. రాత్రి షిఫ్టులో పనిచేసేవారు సూర్యోదయం తర్వాత ఇంటికి చేరిన తర్వాత నిద్రపోవడం కష్టంగా ఉన్నప్పుడు, వారిలో చాలామందికి నిద్రపోవాలనే కోరిక ఉంటుంది. ఇది తాత్కాలిక పరిష్కారంగా పనిచేసినప్పటికీ, నిద్ర కోసం ప్రతిసారీ మద్యం సేవించడం ప్రమాదకరం.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి