Health: పోపుల డబ్బాలో ఉండే ఆ గింజలతో అద్భుత ప్రయోజనాలు.. ఒక్కసారి ఇలా ట్రై చేయండి..
వంటిల్లు పోషకాల ఖజానా అని చెప్పవచ్చు. వంటలో విరివిగా వాడే పదార్ధాలు, దినుసులను నిత్యం వాడుతుంటాం. వీటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయన్న విషయం..
Health Tips: వంటిల్లు పోషకాల ఖజానా అని చెప్పవచ్చు. వంటలో విరివిగా వాడే పదార్ధాలు, దినుసులను నిత్యం వాడుతుంటాం. వీటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. వంటలకు అధిక రుచి ఇవ్వడమే కాకుండా అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటి ఆకులను కూడా ఆహారంలో భాగంగా ఉపయోగిస్తుంటారు. చిన్న చిన్న ఆకులతో ఉండే మెంతి కూరను టమోటా, పప్పుతో కలిపి వండుకుంటారు. అయితే మెంతి గింజలను నానబెట్టి తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు(Experts) చెబుతున్నారు. అవేంటంటే.. మెంతి గింజల నీటిని ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తీసుకోవడం ద్వారా జీవక్రియ సక్రమంగా పనిచేస్తుంది. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఆకలిని నియంత్రించడంతో పాటు కేలరీల అవసరాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. మెంతి గింజలు మధుమేహాన్ని(Diabetes) నిరోధించడానికి అద్భుతంగా పని చేస్తుంది. ఇది ఇన్సులిన్ చర్యను వేగవంతం చేస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది. మెంతి గింజల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మహిళల్లో ఋతు చక్రంతో సమస్యలు, ఇబ్బందులను అరికడతాయి. వీటిలో ఉండే ఆల్కలాయిడ్స్ నొప్పిని తగ్గిస్తుందని నమ్ముతారు. మెంతి గింజల పొడిని తీసుకోవడం వల్ల తిమ్మిరి వచ్చే సమస్యను నివారిస్తుంది.
జీర్ణ సమస్యలు, హైపర్ ఎసిడిటీ ఉన్నవారికి మెంతి గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. మెంతి గింజల పేస్ట్‌లో తురిమిన అల్లం వేసి, భోజనానికి ముందు ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుముఖం పడతాయి. మెంతి నీటిని పరిగడుపున తీసుకుంటే పేగులు శుభ్రపడి వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా పొట్ట లైట్ అవుతుంది. మొలకెత్తిన మెంతి గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి. చర్మాన్ని తేమగా ఉంచుతాయి. మెంతి గింజల పేస్ట్‌ను తేనెతో కలిపి రాత్రి మీ ముఖానికి రాసుకుని, ఉదయాన్నే కడిగాలి. ఇలా చేయడం వల్ల మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. మెంతి గింజల పేస్ట్‌తో తయారు చేసిన ఫేస్ మాస్క్, శెనగపిండి, పెరుగుతో కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ లా రాసుకుంటే నల్ల మచ్చలు తగ్గుతాయి.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.