AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Remedies: జలుబు, ఫ్లూ, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల ఉపశమనానికి వంటింటి చిట్కాలు.. ఉల్లిపాయను ఇలా ఉపయోగించి చూడండి..

ఉల్లిపాయతో మీరు జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులను సులభంగా వదిలించుకోవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ పద్ధతులను అనుసరించడం ద్వారా మీరు మూడు రోజుల్లో ఉశమనం పొందుతారు. 

Home Remedies: జలుబు, ఫ్లూ, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల ఉపశమనానికి వంటింటి చిట్కాలు.. ఉల్లిపాయను ఇలా ఉపయోగించి చూడండి..
Onion Home Remedies
Surya Kala
|

Updated on: Sep 19, 2022 | 4:34 PM

Share

Home Remedies-Cold Issue: ఆహార రుచిని పెంచే ఉల్లిపాయ ఆరోగ్యానికి, చర్మానికి, జుట్టుకు కూడా అనేక విధాలుగా మేలు చేస్తుంది. అందుకనే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే సామెత ఉంది. ఉల్లిలో ఉండే గుణాలు జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఉల్లిపాయలో ఉన్న అనేక ప్రయోజనాల కారణంగా.. ప్రస్తుతం మార్కెట్ లో అనేక ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఉల్లి పాయ జలుబు, కఫం, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని మీకు తెలుసా. ఉల్లిపాయలో యాంటీ-అలెర్జీ, యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ-కార్సినోజెనిక్ లక్షణాలు ఉన్నాయి.  ఈ కారణంగా మీరు యాంటీబయాటిక్స్ ఉపయోగించకుండానే వైరల్ వంటి సమస్యలను అధిగమించవచ్చు. ఉల్లిపాయల లక్షణాలు మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా పని చేస్తాయి. అటువంటి కొన్ని పద్ధతుల గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాం. వీటిని అవలంబించడం ద్వారా మీరు జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులను సులభంగా వదిలించుకోవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ పద్ధతులను అనుసరించడం ద్వారా మీరు మూడు రోజుల్లో ఉశమనం పొందుతారు.

జలుబు కోసం ఉల్లిపాయ రసం ఉల్లిపాయ రసంతో జలుబు సమస్యను అధిగమించవచ్చు. దీని కోసం మీరు ఉల్లిపాయ, నిమ్మరసం రెసిపీని అనుసరించాలి. ఒక పాత్రలో ఉల్లిపాయ రసం తీసుకుని అందులో నిమ్మరసం కలపండి. అనంతరం తేనె కలిపి.. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు మూడు సార్లు తీసుకోండి. మీరు కొన్ని గంటల్లో తేడాను చూడగలరు.

ఉల్లిపాయ సిరప్ జలుబు సమస్యను నుంచి నివారణ కోసం మీరు ఉల్లిపాయ సిరప్‌ని తీసుకోవచ్చు. మీరు ఆనియన్ సిరప్ తయారు చేసుకోవాలంటే.. ఒక పాత్రలో ఉల్లిపాయ రసాన్ని తీసుకుని అందులో కనీసం రెండు చెంచాల తేనె మిక్స్ చేసి కాసేపు అలాగే ఉంచాలి. అనంతరం ఈ సిరప్ ను నాలుగు గంటల వ్యవధిలో తీసుకోవాలి. మీరు ఈ సిరప్‌ను కూడా నిల్వ చేసుకోవచ్చు. ఇది జలుబు బాధితులకు మంచి ఎఫెక్టివ్ రెమిడీ.

ఇవి కూడా చదవండి

ఉల్లిపాయ ఆవిరి సీజనల్ లో వచ్చేజలుబు, ఫ్లూ వంటి వ్యాధులను నయం చేయడానికి ఆవిరి పట్టడం ఉత్తమం. వైద్యులు కూడా ఆవిరి తీసుకోవాలని సిఫార్సు చేస్తారు. చలి సమయంలో.. ముక్కు మూసుకుపోతుంది. ఛాతీలో శ్లేష్మం పేరుకుపోతుంది. ఈ కఫం వలన దగ్గు సమస్య మొదలవుతుంది. మీరు చేయాల్సిందల్లా నీటిని మరిగించి అందులో ఉల్లిపాయ ముక్కలను వేయండి. 5 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. అనంతరం.. నీటిని ఆవిరి పట్టాలి. కాసేపు విశ్రాంతి తీసుకోండి. కొద్దీ సేపు తరువాత జలుబు నుంచి మంచి రిలీఫ్ దొరుకుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ పాఠకుల ఆసక్తిని అంచనాల ఆధారంగా ఉంది. TV9 తెలుగు వీటిని ధృవీకరించలేదు. ఇక్కడ ఇచ్చిన సూచనలను ఆచరించాలంటే.. నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని వీటిని అనుసరించాలి.)