Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Magnesium Deficiency: నరాలు, కండరాల్లో నొప్పా.. అయితే మెగ్నీషియం లోపం అయి ఉండొచ్చు.. బ్రేక్ ఫాస్ట్ లో వీటిని చేర్చుకోండి

మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు శరీరంలో లోపించడం చాలా ప్రమాదకరం. మన శరీరానికి అవసరమైన పోషకం, ఆహారాన్ని మార్చడం ద్వారా దాని లోపాన్ని తీర్చవచ్చు. అల్పాహారంలో వీటిని తినండి. శరీరానికి మెగ్నీషియం పోషకాన్ని అందించండి.

Surya Kala

|

Updated on: Sep 18, 2022 | 4:56 PM

మెగ్నీషియం వంటి పోషకాల కొరత శరీరంలోని నరాలు, కండరాలు, రోగనిరోధక వ్యవస్థ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచే ఈ మూలకం శరీరంలో తగ్గితే.. కొన్ని రకాల ఆహారాన్ని రెగ్యులర్‌గా బ్రేక్‌ఫాస్ట్‌లో తినాలి.

1 / 5
జొన్న పిండి: జొన్నలను గోధుమలతో కలిపి మెత్తగా రుబ్బి వాడతారు. ఇందులో మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అల్పాహారం కోసం జొన్న పిండితో చేసిన పరాఠాను తీసుకోవచ్చు. కనీసం వారానికి రెండుసార్లైనా పెరుగుతో జొన్నతో చేసిన పదార్ధాలను  తినండి.

2 / 5
బాదం బటర్ టోస్ట్: బాదంలో మెగ్నీషియంతో పాటు చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. మీరు అల్పాహారంలో బాదం బటర్ టోస్ట్ ను కలిపి తినవచ్చు. బ్రెడ్ తీసుకొని కాల్చండి. ఇప్పుడు దానిపై బాదం బటర్ టోస్ట్ ను పూయండి. టీ లేదా పాలతో కలిపి తినండి.

3 / 5
బనానా ఓట్స్ పాన్‌కేక్: దీని కోసం కొంచెం అదనపు పదార్థాలు ఉపయోగిస్తారు. ప్రతిసారీ ఈ ఆరోగ్యకరమైన, రుచికరమైన చిరుతిండిని తినాలని కోరుకుంటారు. ముందుగా రోల్డ్ ఓట్స్ ను మెత్తగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు దానికి పాలు, అరటిపండు, వెనీలా, దాల్చిన చెక్క పొడి, ఉప్పు, బేకింగ్ పౌడర్ జోడించండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాన్‌లో వేసి.. రోస్ట్ చేసుకోవాలి. దీంతో బనానా ఓట్స్ పాన్‌కేక్ తినడానికి రెడీ.

4 / 5
 మొలకలు: అల్పాహారం బాగా చేస్తే, రోజంతా శరీరంలో శక్తి ఉంటుంది. పెసర్లను రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు వాటిని తడి గుడ్డలో ఉంచండి. మూడో రోజు పేసర్లు మొలకెత్తుతాయి. మీకు కావాలంటే, మీరు దీనికి తరిగిన టమోటాలు, ఉల్లిపాయలతో పాటు, నిమ్మరసం కూడా జోడించవచ్చు.

5 / 5
Follow us