Health Tips: భోజనం తర్వాత స్వీట్లతోపాటు ఇవి తింటున్నారా..? అయితే, పెను ప్రమాదంలో పడినట్లే..
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల అనేక వ్యాధుల ముప్పు ఎక్కువైంది. అందుకే ఆహారం, పానీయాలకు సంబంధించిన విషయంలో ఆరోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు చేస్తుంటారు.
5 foods to avoid for dinner: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల అనేక వ్యాధుల ముప్పు ఎక్కువైంది. అందుకే ఆహారం, పానీయాలకు సంబంధించిన విషయంలో ఆరోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు చేస్తుంటారు. అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు ఎలాంటి పదార్థాలు తినాలి..? ఎప్పుడు తినాలి అనేది చాలా ముఖ్యం. అయితే.. ఏమైనా అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. చాలా మంది వ్యక్తులు డిన్నర్‌లో అలాంటి వాటిని చేర్చుకుంటారు. ఇది శరీరంలో యాసిడ్, టాక్సిన్స్ మొత్తాన్ని పెంచుతుంది. రాత్రిపూట ఆహారం విషయంలో ఆయుర్వేద వైద్యులు కొన్ని సలహాలు, సూచనలు చేస్తున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రాత్రిపూట గోధుమలు, దాని ఉత్పత్తులను అధికంగా తీసుకోవడం వల్ల విషపూరిత టాక్సిన్స్ పెరుగుతాయని, ఇది జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు. ఆయుర్వేదం ప్రకారం.. గోధుమలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
చాలా మందికి రాత్రిపూట పెరుగు తినడం అలవాటు. ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీన్ని తినడం వల్ల కఫం, పిత్తం పెరుగుతుంది. ఇంకా గొంతు నొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి.
అంతే కాకుండా పిండితో చేసిన వస్తువులను కూడా రాత్రిపూట తినడం మానేయాలి. మైదాలో ఫైబర్ ఉండదు. ఇది మలబద్ధకం వంటి వ్యాధులను కలిగిస్తుంది. మైదాతో చేసిన వాటిని జీర్ణం చేసుకోవడం కష్టం. అందువల్ల, ఇది కడుపు సంబంధిత సమస్యలను పెంచుతుంది.
చాలా మందికి ఆహారంతో పాటు సలాడ్ తినడం అలవాటుగా ఉంటుంది. సలాడ్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే రాత్రిపూట తినడం మానేయడం మంచిది. రాత్రిపూట దీన్ని తీసుకోవడం వల్ల వాతం తీవ్రతరం అవుతుంది. ఇది కడుపు సమస్యలకు కారణమవుతుంది.
భోజనం తిన్న తర్వాత చాలామంది స్వీట్లు తింటారు. అలాంటి వారు జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది డిన్నర్ తర్వాత డెజర్ట్ లేదా చాక్లెట్ తింటారు. వీటిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. వాస్తవానికి, ఇవి ఆరోగ్యాన్ని దెబ్బతీసి బరువును పెంచుతాయి. జీర్ణ సమస్యలతోపాటు శ్లేష్మం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..