Kiwi Side Effects: కివీ పండ్లను విపరీతంగా తింటున్నారా? అయితే, ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..

డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు, లేదా ఆరోగ్యం కోసం కివీ జ్యూస్ లేదా కివీ ఫ్రూట్ తినాలని వైద్య నిపుణులు తరచుగా సలహా ఇస్తుంటారు. ఇది కాకుండా, అనేక రకాల వైరల్ ఫీవర్లలో, ప్లేట్‌లెట్ కౌంట్ పెంచడానికి కివీని తినమని చెబుతారు.

Kiwi Side Effects: కివీ పండ్లను విపరీతంగా తింటున్నారా? అయితే, ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..
Kiwi Fruit
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 18, 2022 | 2:27 PM

Kiwi Side Effects: డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు, లేదా ఆరోగ్యం కోసం కివీ జ్యూస్ లేదా కివీ ఫ్రూట్ తినాలని వైద్య నిపుణులు తరచుగా సలహా ఇస్తుంటారు. ఇది కాకుండా, అనేక రకాల వైరల్ ఫీవర్లలో, ప్లేట్‌లెట్ కౌంట్ పెంచడానికి కివీని తినమని చెబుతారు. కివీలో ఉండే గుణాలు అందరికీ ఆరోగ్యకరం. కివిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫెక్షన్ లక్షణాలు వంటి అనేక లక్షణాలు ఉన్నాయి. ఇది కాకుండా, విటమిన్ సి, విటమిన్ B6, ఫైబర్, పొటాషియం, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, రైబోఫ్లావిన్, బీటా కెరోటిన్ మొదలైన అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

కివీలో ఉండే ఈ గుణాలు మిమ్మల్ని అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచుతాయి. కానీ కివీని అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుందన్న విషయం మీకు తెలుసా.? తెలియకపోతే ఈ విషయాలను తెలుసుకోండి.. కివిని అధికంగా తీసుకోవడం వల్ల అనేక సమస్యలకు దారి తీస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కివి ఆరోగ్య ప్రయోజనాలు

ఇవి కూడా చదవండి

అలెర్జీ సమస్య: కివీని అధిక పరిమాణంలో తీసుకుంటే అలెర్జీ లాంటి సమస్యలు రావొచ్చు. ముఖ్యంగా దీని వల్ల చర్మంపై దద్దుర్లు, వాపులు, నోటి లోపల చికాకు, ఆస్తమా వంటి సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

నోటి అలెర్జీ సిండ్రోమ్: కివీని బాగా తీసుకోవడం వల్ల నోటి అలెర్జీ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఈ కారణంగా పెదవులు, నాలుక వాపు నోటి లోపల పుండ్ల లాంటి సమస్య మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితిలో వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

మూత్రపిండాల సమస్యలు: కిడ్నీ రోగులు కివీ వినియోగాన్ని నివారించాలని సూచిస్తున్నారు. వాస్తవానికి, కివిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంద. ఇది కిడ్నీ సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. అందువల్ల, కివీని అధికంగా తీసుకోవడం మానుకోండి.

అతిసార సమస్య: కివిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, దీని కారణంగా మీకు డయేరియా సమస్యలు ఉండవచ్చు. అంతేకాకుండా కొంతమందికి కడుపు నొప్పి, వాంతులు, వికారం వంటి సమస్యలు కనిపిస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?