Rock Salt Side Effects: రాక్‌ సాల్ట్‌ ఎక్కువగా వాడుతున్నారా..? ఈ సమస్యలు పెరుగుతాయి.. జాగ్రత్త..

రోజువారి ఆహారంలో కూడా రాళ్ల ఉప్పును వాడుతున్నారు. ఈ ఉప్పు గుండె, రక్తపోటు రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే పింక్‌ సాల్ట్‌ను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల శరీరంలోని అనేక పోషకాల లోపం ఏర్పడుతుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు.

Rock Salt Side Effects: రాక్‌ సాల్ట్‌ ఎక్కువగా వాడుతున్నారా..? ఈ సమస్యలు పెరుగుతాయి.. జాగ్రత్త..
Pink Salt
Follow us

|

Updated on: Sep 25, 2022 | 7:16 AM

Rock Salt Side Effects: రాక్ సాల్ట్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని పింక్ సాల్ట్ లేదా హిమాలయన్ సాల్ట్ అని కూడా పేర్కొంటారు. ఆరోగ్యానికి కాపాడే పోషకాలు దీనిలో పుష్కలంగా ఉంటాయి. అందుకే చాలామంది సాధారణ ఉప్పుకు బదులుగా దీనిని ఉపయోగిస్తుంటారు. పూర్వం ఈ ఉప్పును ఉపవాసంలో మాత్రమే వాడేవారు. ఇప్పుడు రోజువారి ఆహారంలో కూడా రాళ్ల ఉప్పును వాడుతున్నారు. ఈ ఉప్పు గుండె, రక్తపోటు రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే పింక్‌ సాల్ట్‌ను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల శరీరంలోని అనేక పోషకాల లోపం ఏర్పడుతుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. రాక్ సాల్ట్‌ను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు, ఎలాంటి వ్యక్తులు దీనిని ఎక్కువగా తినకూడదు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

రాక్‌ సాల్ట్‌ ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు

రాక్ సాల్ట్ శరీరానికి చాలా మేలు చేస్తుంది. అయితే దీన్ని ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. చాలామంది ప్రజలు ఇప్పుడు రాక్‌ సాల్ట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది అయోడిన్ లోపానికి దారితీస్తుంది. ఇంకా శరీరంలో వాటర్‌ రిటెన్షన్‌ సమస్య (శరీర భాగాల్లో నీరు చేరడం) కూడా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

అయోడిన్ లోపంః సాధారణ ఉప్పు కంటే రాతి ఉప్పులో అయోడిన్ చాలా తక్కువగా ఉంటుంది. మీరు చాలా కాలం పాటు ఆహారంలో రాతి ఉప్పును ఉపయోగిస్తే, అది అయోడిన్ లోపం, శరీరంలో వచ్చే వ్యాధులకు దారితీస్తుంది.

వాటర్‌ రిటెన్షన్‌ సమస్యః ఎక్కువ కాలం ఆహారంలో రాతి ఉప్పును మాత్రమే వాడేవారు, ఉప్పు ఎక్కువగా తినే వారి శరీరంలో నీరు నిలుపుదల సమస్య ఉంటుంది. దీంతో శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి.

అధిక రక్తపోటుః రాక్ సాల్ట్ రక్తపోటును నియంత్రించడానికి ఉపయోగిస్తారు. కానీ రాతి ఉప్పును ఎక్కువగా తినడం వల్ల కూడా అధిక రక్తపోటు వస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

అలసట – కండరాల బలహీనతః రాతి ఉప్పును ఎక్కువగా వాడితే శరీరంలో అలసట, కండరాలు బలహీనపడతాయి. కాబట్టి, రాతి ఉప్పును సమతుల్య పరిమాణంలో మాత్రమే తినాలి.

థైరాయిడ్‌ సమస్యః థైరాయిడ్ రోగులు రాళ్ల ఉప్పుతో హానికరం. శరీరంలో అయోడిన్ లోపం ఉంటే, థైరాయిడ్ రోగి సమస్య పెరుగుతుంది.

ఎలా ఉపయోగించాలి

ఆహారంలో సాధారణ ఉప్పు స్థానంలో దీనిని ఉపయోగించవచ్చు. అయితే ఈ ఉప్పు మోతాదులో కూడా జాగ్రత్త వహించండి. ఉప్పు ఏదైనా కావచ్చు, అతిగా తినడం వల్ల హాని కలుగుతుంది. రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారు రాక్ సాల్ట్ తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..

అందం, అభినయంతో కృతి సనన్ కొల్లగొట్టిన సినిమా అవార్డులు ఇవే..
అందం, అభినయంతో కృతి సనన్ కొల్లగొట్టిన సినిమా అవార్డులు ఇవే..
'ఊ అంటావా ఊఊ అంటావా'.. మళ్లీ తెలుగులో పాట పాడిన అలియా.. వీడియో
'ఊ అంటావా ఊఊ అంటావా'.. మళ్లీ తెలుగులో పాట పాడిన అలియా.. వీడియో
సీఎం రేవంత్‌ను కలిసిన మల్లారెడ్డి.. అందుకేనన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
సీఎం రేవంత్‌ను కలిసిన మల్లారెడ్డి.. అందుకేనన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
సాకారం అవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల..!
సాకారం అవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల..!
అట్టహాసంగా ప్రారంభమైన TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా
అట్టహాసంగా ప్రారంభమైన TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా
పిల్లల్లో ఏకాగ్రతను పెంచాలంటే.. పేరెంట్స్‌ చేయాల్సిన కీలక పనులు
పిల్లల్లో ఏకాగ్రతను పెంచాలంటే.. పేరెంట్స్‌ చేయాల్సిన కీలక పనులు
ఈ టాలీవుడ్ విలన్‌కు హీరోయిన్‌లాంటి భార్య.. అజయ్ ఫ్యామిలీ ఫొటోస్
ఈ టాలీవుడ్ విలన్‌కు హీరోయిన్‌లాంటి భార్య.. అజయ్ ఫ్యామిలీ ఫొటోస్
ఉరుములు, మెరుపులతో తెలంగాణలో ఈ జిల్లాల్లో వర్షాలు
ఉరుములు, మెరుపులతో తెలంగాణలో ఈ జిల్లాల్లో వర్షాలు
'జమ్మూకశ్మీర్‌లో కిడ్నాపైన ఆర్మీ జవాన్‌ మృతదేహం లభ్యం'
'జమ్మూకశ్మీర్‌లో కిడ్నాపైన ఆర్మీ జవాన్‌ మృతదేహం లభ్యం'
బిగ్ బాస్ ఓటింగ్‌లో గంగవ్వ హవా.. డేంజర్ జోన్‌లో ఎవరున్నారంటే?
బిగ్ బాస్ ఓటింగ్‌లో గంగవ్వ హవా.. డేంజర్ జోన్‌లో ఎవరున్నారంటే?