Health Tips: ఈ పప్పుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా.. సాఫీగా నడవాలన్నా పోషకాలు తప్పనిసరిగా కావాలి. ఈ పోషకాలు మనం తీసుకునే ఆహారం ద్వారా భర్తీ అవుతాయి. కానీ కొంతమంది పోషకాహారాన్ని తినడానికి నిరాకరిస్తారు.
![Health Tips: ఈ పప్పుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/09/pulses.jpg?w=1280)
Benefits of Pulses: శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా.. సాఫీగా నడవాలన్నా పోషకాలు తప్పనిసరిగా కావాలి. ఈ పోషకాలు మనం తీసుకునే ఆహారం ద్వారా భర్తీ అవుతాయి. కానీ కొంతమంది పోషకాహారాన్ని తినడానికి నిరాకరిస్తారు. కొందరికి అన్నం అంటే ఇష్టం ఉండదు.. మరికొందరికి పప్పులు ఇష్టం ఉండవు. కానీ ఆహారంలో ప్రతిదాని పరిమాణం సమానంగా ఉండాలని.. దీనిద్వారా శరీరం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. పప్పు దినుసులను ఇష్టపడని వారుంటే.. ముందు ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. పప్పుధాన్యాల వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. అవి తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం అంటున్నారు. పప్పుధాన్యాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మసూర్ పప్పు ప్రయోజనాలు
మసూర్ పప్పు మన శరీరంలో రక్త స్థాయిని నిర్వహిస్తుంది. అతిసారం, మలబద్ధకం సమస్య నుంచి ఈ పప్పు ఉపశమనం కలిగిస్తుంది. దీనితో పాటు కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. దీన్ని తినడం వల్ల కళ్లకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. ఈ పప్పు ధాన్యంలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. కానీ ప్రోటీన్, ఫైబర్ ఇందులో పుష్కలంగా ఉంటాయి.
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/09/viral-video-44.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/09/dog-3.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/09/bjp-mp-janardan-mishra.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/08/dragon-fruit.jpg)
శనగ పప్పుతో బోలెడన్ని లాభాలు..
మీ శరీరంలో హార్మోన్ల స్థాయి తగ్గిపోతే.. శనగ పప్పు దానిని చాలా వరకు మెరుగుపరుస్తాయి. ఇంకా శనగ పప్పు కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహిస్తుంది. ఈ పప్పులో కొవ్వు కూడా తక్కువే. జిమ్ చేసేవారికి ఇది మంచి ప్రొటీన్ మూలంగా పేర్కొంటారు. పప్పులో కార్బోహైడ్రేట్, ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తాయి.
మినప పప్పుతో బోలెడన్ని ప్రయోజనాలు
మినప పప్పులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది మన శరీరంలో ఐరన్ లోపాన్ని తీరుస్తుంది. రక్తం హీనత సమస్య నుంచి బయటపడేలా చేస్తుంది. ఇంకా మినప పప్పు ఎముకలను బలం చేకూర్చుతుంది. డయాబెటిక్ రోగులకు చాలా ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తారు.
పెసర పప్పుతో జీర్ణక్రియ సమస్యలు దూరం..
కాలేయం లేదా జీర్ణక్రియకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే పెసర పప్పు ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది గ్యాస్ సమస్యతో బాధపడుతున్న వారికి కూడా మంచిదే. ఈ పప్పు మీ చర్మానికి చాలా మంచిది. చర్మం గ్లోను కూడా పెంచుతుంది. చాలా ప్రోటీన్లు పెసర పప్పులో ఉంటాయి. అయితే షుగర్ సమస్యతో బాధపడేవారు దానిని తీసుకోవడం తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..