Health Tips: ఎప్పుడు పడితే అప్పుడు వేడి నీళ్లు ఫుల్లుగా తాగుతున్నారా..? ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..
బరువు తగ్గడానికి లేదా చర్మ సమస్యల నుంచి బయటపడేందుకు చాలా మంది తరచుగా వేడి నీటిని ఆశ్రయిస్తారు. అదే సమయంలో చాలామంది ఉదయం నిద్రలేచిన వెంటనే వేడినీరు తాగుతుంటారు.
Side Effects Of Warm Water: బరువు తగ్గడానికి లేదా చర్మ సమస్యల నుంచి బయటపడేందుకు చాలా మంది తరచుగా వేడి నీటిని ఆశ్రయిస్తారు. అదే సమయంలో చాలామంది ఉదయం నిద్రలేచిన వెంటనే వేడినీరు తాగుతుంటారు. ఇంకా దీనిలో నిమ్మ రసం, తేనె లాంటివి కలుపుకొని తాగుతారు. కానీ అధిక వేడి నీరు మీ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా హానిని కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడినీరు తాగడం వల్ల శరీరానికి మంచికంటే ఎక్కువ నష్టాలు కలుగుతాయని పేర్కొంటున్నారు. వేడినీరు తాగడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
వేడినీరు తాగడం వల్ల కలిగే నష్టాలు
కడుపులో చికాకు: వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని అంతర్గత అవయవాలపై ప్రభావం పడుతుంది. మరోవైపు ఎక్కువ సేపు వేడినీరు తాగడం వల్ల కడుపులో మంట సమస్య వేధిస్తుంది.
ప్రేగు సమస్యలు: వేడి నీటిని తాగడం వల్ల ప్రేగు సమస్యలు పెరుగుతాయి. ఇప్పటికే ప్రేగు సంబంధిత, జీర్ణ సమస్యలతో బాధపడుతున్నట్లయితే వేడి నీటిని తీసుకోవడం మానుకోండి.
మూత్రపిండాలపై ప్రభావం: మూత్రపిండాలు ప్రత్యేకమైన కేశనాళిక వ్యవస్థను కలిగి ఉంటాయి. ఇది శరీరం నుంచి అదనపు నీటిని, విషాన్ని బయటకు పంపడంలో సహాయపడతాయి. మరోవైపు, మీరు ఎక్కువ వేడి నీటిని తీసుకుంటే ఇది మూత్రపిండాలపై సాధారణం కంటే ఎక్కువ ఒత్తిడి కలుతుంది. దీని కారణంగా మూత్రపిండాల సాధారణ పనితీరులో సమస్య ఏర్పడుతుంది. కావున ఎక్కువ వేడి నీటిని తాగే ముందు జాగ్రత్తగా ఉండండి.
నిద్రకు ఆటంకం : రాత్రి పడుకునేటప్పుడు వేడినీళ్లు తాగితే నిద్ర సమస్యలు రావచ్చు. ఎందుకంటే రాత్రి నిద్రించే సమయంలో వేడినీళ్లు తాగడం వల్ల తరచుగా మూత్రవిసర్జన వస్తుంది. ఈ సందర్భంలో మీ నిద్రకు భంగం కలగవచ్చు.
కావున, అతిగా వేడి నీటిని తాగడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల దీర్ఘకాలిక సమస్యలు కూడా రావొచ్చని పేర్కొంటున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..