- Telugu News Photo Gallery These health related changes shows after suddenly stop eating eggs in telugu
Health Tips: గుడ్లను ఎక్కువగా తీసుకునేవారు అకస్మాత్తుగా ఆపేస్తే.. శరీరంలో కలిగే మార్పులు ఏమిటో తెలుసా..
గుడ్లు సంపూర్ణ ఆహారం. కొంతమంది గుడ్లు తినడానికి చాలా ఇష్టపడతారు. ఎంతగా ఇష్టపడతారంటే.. గుడ్డు తినకుండా తమ రోజుని కూడా ప్రారంభించరు. అయితే కొందరు గుడ్లు తినడం అకస్మాత్తుగా ఆపివేస్తారు.
Updated on: Sep 25, 2022 | 2:51 PM

గుడ్లు సంపూర్ణ ఆహారం. కొంతమంది గుడ్లు తినడానికి చాలా ఇష్టపడతారు. ఎంతగా ఇష్టపడతారంటే.. గుడ్డు తినకుండా తమ రోజుని కూడా ప్రారంభించరు. అయితే కొందరు గుడ్లు తినడం అకస్మాత్తుగా ఆపివేస్తారు. అప్పుడు శరీరంలో ఈ మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు గుడ్లు అకస్మాత్తుగా ఆపేస్తే శరీరంలో కలిగే మార్పులు గురించి తెలుసుకుందాం..

కడుపు ఉబ్బరం నుండి ఉపశమనం: గుడ్లు ఎక్కువగా తినే వారు కొన్ని కారణాల వల్ల అకస్మాత్తుగా తినడం మానేస్తారు. అప్పుడు వారి కడుపు మళ్లీ ఆరోగ్యంగా మారుతుంది. పొట్ట ఉబ్బరం సమస్య దూరమవుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గించడం: గుడ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే గుడ్లను ఎక్కువగా తినేవారు.. అకస్మాత్తుగా ఆపడం ద్వారా, కొలెస్ట్రాల్ స్థాయి కూడా తగ్గుతుంది. కోడిగుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో తేలింది. అటువంటి పరిస్థితిలో, గుడ్లను తినడం ఆపడం ద్వారా, చెడు కొలెస్ట్రాల్ స్థాయిని చాలా వరకు నియంత్రించవచ్చు.

మొటిమలు ఆగిపోతాయి: నివేదికల ప్రకారం.. మొటిమలు కనిపించడానికి కారణం ప్రొజెస్టెరాన్ హార్మోన్. ఇది గుడ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువగా గుడ్లు తినేవారి ముఖంలో మొటిమలు వస్తాయి. గుడ్లు తినడం మానేయడం ద్వారా మొటిమల సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

గుండెపోటు: గుడ్లు అధికంగా తీసుకోవడం వల్ల ధమనులలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ధమనులలో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే.. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మీరు గుడ్లు తీసుకోవడం మానేస్తే, గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.




