- Telugu News Photo Gallery Health Benefits of Dates: Eating date fruits will cure heart and arthritis disease
Dates: రాత్రి పూట నిద్రపట్టడంలేదా? ఐతే ప్రతి రోజూ నిద్రపోయే ముందు ఒక ఖర్జూరం..
ఖర్జూరాన్ని చాలా మంది ఇష్టం తింటారు. ఎండు ఖర్జూరాలను కూడా వివిధ వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. ఖర్జూరాన్ని ఎలా తిన్నా మంచిదేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును.. ఇవి రుచికేకాకుండా, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా రాత్రివేళల్లో..
Updated on: Oct 08, 2022 | 10:50 AM

ఖర్జూరాన్ని చాలా మంది ఇష్టం తింటారు. ఎండు ఖర్జూరాలను కూడా వివిధ వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. ఖర్జూరాన్ని ఎలా తిన్నా మంచిదేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును.. ఇవి రుచికేకాకుండా, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట ఖర్జూరం తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

ఖర్జూరాలు గుండెకు చాలా మేలు చేస్తాయి. వీటిలోని పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు, రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.

రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టకపోతే ఖర్జూరం తింటే వెంటనే నిద్రలోకి జారుకుంటారు. వీటిలోని మెగ్నీషియం నిద్ర పట్టేలా ప్రేరేపిస్తాయి. అందుకే చాలా మంది నిద్రపోయే ముందు ఖర్జూరం తింటుంటారు.

రక్తలేమితో బాధపడేవాళ్లు రోజూ క్రమం తప్పకుండా ఖర్జూరాలు తినడం వల్ల ప్రొటీన్లు సమృద్ధిగా అందుతాయి. చర్మం, జుట్టు సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. ఇది చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది. జుట్టు సమస్యలను దూరం చేస్తుంది.

ఎముకల వ్యాధులకు కూడా ఖర్జూరం మేలు చేస్తుంది. అందుకే ఖర్జూరాలు తినమని ఆర్థరైటిస్ రోగులకు వైద్యులు సూచిస్తుంటారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి. ఇన్సులిన్‌ను పెంచడంలో కూడా సహాయపడతాయి.




