- Telugu News Photo Gallery Business photos Hero launches its first electric scooter vida v1 and v1 pro in india Telugu Business News
Hero electric: అదిరిపోయే ఫీచర్లతో హీరో నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?
ప్రముఖ వాహన తయారీ సంస్థ హీరో తాజాగా తమ సంస్థ నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. విడా వీ1, వీ1 ప్రో పేర్లతో రెండు వెర్షన్స్ స్కూటర్‌లను శుక్రవారం పరిచయం చేశారు..
Updated on: Oct 07, 2022 | 6:19 PM

ప్రముఖ కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలోకి అడుగు పెట్టిన నేపథ్యంలో జాగా భారతీయ అదిపెద్ద టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చింది. విడా వీ1, వీ1 ప్రో పేర్లతో రెండు వేరియంట్స్‌లో స్కూటర్లను లాంచ్ చేసింది. శుక్రవారం హీరో ఈ స్కూటర్లను ప్రపంచానికి పరిచయం చేసింది.

స్కూటర్ ఫీచర్ల విషయానికొస్తే.. 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ టర్న్ బై టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లను అందించారు. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 165 కిమీలు వెళ్లొచ్చు.

ఫాలో మీ హోమ్ లైట్, ఎస్‌ఓఎస్ అలర్ట్స్, రివర్స్ మోడ్, బూస్ట్ మోడ్ లాంటి ఎన్నో అధునాతన ఫీచర్లను ఇందులో అందించారు. అంతేకాకుండా ఓటీఏ అప్‌డేట్‌లను అందించేందుకు టెక్నాలజీని ఉపయోగించారు.

ఇక ఈ స్కూటర్ బుకింగ్స్‌ను అక్టోబర్ 10వ తేదీన ప్రారంభించనున్నారు. డెలివరీని డిసెంబర్ రెండో వారంలో ప్రారంభించనున్నారు. ఈ స్కూటర్ల కోసం తైవాన్‌కు చెందిన గోగోరో అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ధర విషయానికొస్తే.. విడా వీ1 ధరను ఇండియాలో రూ. 1.45 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. విడా ప్రో రూ. 1.59 లక్షలు (ఎక్స్-షోరూమ్). 2499 రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి బెంగళూరు ఢిల్లీ , జైపూర్ మూడు నగరాల్లో దశల వారీగా లాంచ్‌లు ప్రారంభమవుతాయి.




