- Telugu News Health Blood Sugar Level Tips:dussehra 2022 eat sweets and maintain sugar level by these healthy drinks
Blood Sugar Level Tips: పండగ రోజున స్వీట్స్ ను మిస్ అవుతున్నారా.. ఈ పానీయాలను తాగండి.. మిఠాయిలు తినండి
పండగలు, శుభకార్యాల సమయంలో రుచికరమైన ఆహారపదార్ధాలను తయారు చేయడం లేదా తినడం వేడుక ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. మిఠాయిలు లేకుండా పండుగ సీజన్‌ను ఆస్వాదించడం కష్టం. అయితే షుగర్ పేషేంట్స్ తీపి పదార్థాలను తినాలనుకుంటున్నారా.. అయితే మీరు ఈ ఆరోగ్యకరమైన పానీయాలను తప్పకుండా చేర్చుకోండి.
Updated on: Oct 05, 2022 | 12:59 PM

ప్రస్తుతం ఉన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా చాలా మంది ..ముఖ్యముగా షుగర్ పేషేంట్స్ తమకు ఇష్టమైన స్వీట్స్ ను తినలేకపోతున్నారు. అయితే మధుమేహ వ్యాధి గ్రస్తులు కూడా అందరితో సమానంగా స్వీట్ తినాలనుకుంటున్నారా! ఇప్పుడు ఇక్కడ ఇస్తున్న పానీయాలను ట్రై చేసి చూడండి.. ఇవి చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి.

మెంతి గింజల నీరు: దసరా లేదా దీపావళి కావచ్చు.. ఏ పండగ సమయంలోనైనా తీపి పదార్థాలను తింటే చక్కెర స్థాయి పెరుగుతుందని భయం షుగర్ పేషేంట్స్ కు ఉంది. అటువంటి వారు ప్రతిరోజూ మెంతి గింజల నీటిని తాగాలి. మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి, ఉదయం గోరువెచ్చగా తాగాలి. కావాలంటే పేస్టులా చేసుకుని తినొచ్చు.

జీలకర్ర నీరు: ఆయుర్వేదంలో కూడా జీలకర్ర ప్రత్యేక ప్రాముఖ్యత గురించి చెప్పబడింది. జీలకర్రలో యాంటీఆక్సిడెంట్లు చాలా ఉన్నాయి, ఇవి చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. జీలకర్రను రాత్రంతా నానబెట్టి, ఉదయం గోరువెచ్చని నీటిని త్రాగాలి.

వేప - తులసి: ఈ రెండు ఆకుల్లో షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేసి, మధుమేహం బారిన పడకుండా కాపాడే గుణాలు ఉన్నాయి. వేప, తులసి ఆకులను ఉదయాన్నే వేడి చేసి ఈ నీటిని తాగితే చాలు.

దాల్చిన చెక్క డిటాక్స్ డ్రింక్: దాల్చిన చెక్క మధుమేహంతో బాధపడే వారికి కూడా చాలా మంచిది. దీని కోసం, 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని తాగండి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.





























