Chittoor: గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు.. దెబ్బతిన్నస్టేషన్, చుట్టుపక్కల ఇల్లులు, ఏఎస్ఐకు గాయాలు

ఈ భారీ పేలుడు ప్రభావంతో పాక్షికంగా పోలీస్ స్టేషన్, చుట్టుపక్కన ఉన్న నివాస గృహాలు దెబ్బతిన్నాయి. ఈ పేలుడు లిక్కర్ కేసులో సీజ్ చేసిన కారులో ఉన్న పేలుడు పదార్ధాల వలన జరిగినట్లు తెలుస్తోంది.

Chittoor: గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు.. దెబ్బతిన్నస్టేషన్, చుట్టుపక్కల ఇల్లులు, ఏఎస్ఐకు గాయాలు
Blast In Gd Nellore Ps
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 08, 2022 | 7:58 AM

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు సంభవించింది. అర్ధ రాత్రి 3 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసు స్టేషన్ ఆవరణలోని కారులో భారీ పేలుడు జరగడంతో పోలీస్ స్టేషన్ సహా చుట్టుపక్కల ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పోలీస్ స్టేషన్స్ కిటికీ డోరు అద్దాలు పగిలి పోయాయి. ఈ పేలుడు సంభవించిన సమయంలో స్టేషన్ లో ఏఎస్ఐ ఆంజనేయులు రెడ్డి, కానిస్టేబుల్ గజేంద్ర లతో పాటు.. ఎస్సై గదిలో నిద్రిస్తున్న ఏఎస్ఐ ఆంజనేయ రెడ్డిలు ఉన్నాయి. పగిలిన కిటికీ గాజు ముక్కలు నిద్రిస్తున్న ఏఎస్ఐ ఆంజనేయ రెడ్డిపై పడ్డాయి. దీంతో ఆయన స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది.

ఈ భారీ పేలుడు ప్రభావంతో పాక్షికంగా పోలీస్ స్టేషన్, చుట్టుపక్కన ఉన్న నివాస గృహాలు దెబ్బతిన్నాయి. ఈ పేలుడు లిక్కర్ కేసులో సీజ్ చేసిన కారులో ఉన్న పేలుడు పదార్ధాల వలన జరిగినట్లు తెలుస్తోంది. సీజ్ చేసిన కారులో ఉంచిన జిలెటిన్ స్టిక్స్ లేదంటే నల్ల ముందు పేలి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పేలుడు సంభవించిన ప్రాంతంలోని కాంక్రీట్ నేల గోతిలా ఏర్పడటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నారు. వెంటనే స్పందించిన పోలీసు యంత్రాంగం పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

2018లో ఒక కేసు లో సీజ్ చేసిన నల్లమందును ఒక చెట్టుకింద సేఫ్ గా  పోలీసులు దాచి ఉంచారు. దాదాపు 2 కిలోల నల్లమందు పేలడంతో ప్రమాదం సంభవించింది. పేలుడు జరిగిన ప్రాంతంలో  సీజ్ చేసిన అనేక వాహనాలు పార్కింగ్ చేసి ఉన్నాయి. ఈ పేలుడు తో ఈ వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ పేలుడు ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..