Shiv Sena Symbol: క్లైమాక్స్‌కు శివసేన సింబల్‌వార్.. కొత్త గుర్తు కోసం ఉద్దవ్-షిండే వర్గాల పోరాటం..
శివసేన ఎన్నికల సింబల్‌ను ఈసీ ఫ్రీజ్ చేయడంతో షాక్‌లో ఉన్న ఉద్దవ్, షిండే వర్గాలు కొత్త గుర్తు కోసం ఆరాటపడుతున్నాయి. ఈసీకి మూడు గుర్తులు, మూడు పేర్లను..
శివసేన ఎన్నికల సింబల్‌ను ఈసీ ఫ్రీజ్ చేయడంతో షాక్‌లో ఉన్న ఉద్దవ్, షిండే వర్గాలు కొత్త గుర్తు కోసం ఆరాటపడుతున్నాయి. ఈసీకి మూడు గుర్తులు, మూడు పేర్లను సూచిస్తూ ఉద్దవ్ వర్గం లేఖ రాసింది. శివసేన తమది అంటే తమది అంటూ ఉద్ధవ్ వర్గం, షిండే వర్గాలు పోట్లాడుకుంటున్న తరుణంలో.. విల్లు-బాణం గుర్తును ఫ్రీజ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.
శివసేన విల్లు-బాణం గుర్తును ఈసీ ఫ్రీజ్ చేయడంతో కొత్త గుర్తు కోసం ఉద్దవ్, షిండే వర్గాలు పోరాటాన్ని ప్రారంభించాయి. ఉద్దవ్‌థాక్రే తన వర్గం ఎమ్మెల్యేలతో, నేతలతో సమావేశం తరువాత కీలక నిర్ణయం తీసుకున్నారు. తమకు త్రిశూలం, కాగడా, లేదా ఉదయించే సూర్యుడు గుర్తుల్లో ఏదో ఒకటి కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అదేవిధంగా పార్టీ పేరును బాలాసాహేబ్ శివసేన, బాలాసాహేబ్ ప్రభోదక్ థాక్రే, ఉద్దవ్ బాలాసాహేబ్ థాక్రేలో ఏదో ఒకటి ఉండేలా చూడాలని ఈసీకి ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ఉద్దవ్ థాక్రే మూడు ఎన్నికల గుర్తులను ఈసీ ముందుకు పంపించారు. త్రిశూలం, కాగడా, లేదా ఉదయించే సూర్యుడు గుర్తుల్లో ఒకటి కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. శివసేన పేరు మార్చాలంటే బాలాసాహేబ్ శివసేన, బాలాసాహేబ్ ప్రభోదక్ థాక్రే, ఉద్దవ్ బాలాసాహేబ్ థాక్రే గా ఉండాలని కోరారు.
ఇదిలాఉంటే.. ఉద్దవ్ వర్గం నిర్ణయంపై షిండే వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాల్‌థాక్రే సిద్దాంతానికి తామే అసలైన వారసులమని, బాలాసాహేబ్ పేరు తమ వర్గానికి దక్కకుండా ఉద్దవ్ వర్గం కుట్ర చేసిందని వాళ్లు ఆరోపించారు. ఇకపోతే ఏ గుర్తు కావాలో సోమవారం లోగా చెప్పాలని అటు ఉద్దవ్ వర్గం, ఇటు షిండే వర్గానికి ఈసీ నోటీసులు ఇచ్చింది. న్యాయపోరాటం తమదే అసలైన శివసేనగా తేలుతుందని ఇరువర్గాలు నమ్మకంతో ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..