Andhra Pradesh: ఒకే ఒక్క సంతకం.. యావదాస్తి జీజీహెచ్‌కి ధారాదత్తం.. ఆమెను స్ఫూర్తిని తీసుకుని..

డాక్టర్‌ ఉమా గవిని. తెలుగురాష్ట్రాల్లో రీసౌండ్‌ చేస్తోన్న పేరిది. దశాబ్దాలుగా కష్టపడి కూడబెట్టిన కోట్ల రూపాయల ఆస్తిని ఒకే ఒక్క సంతకంతో జీజీహెచ్‌కి ధారాదత్తం చేశారు.

Andhra Pradesh: ఒకే ఒక్క సంతకం.. యావదాస్తి జీజీహెచ్‌కి ధారాదత్తం.. ఆమెను స్ఫూర్తిని తీసుకుని..
Guntur Ggh
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 08, 2022 | 8:57 PM

డాక్టర్‌ ఉమా గవిని. తెలుగురాష్ట్రాల్లో రీసౌండ్‌ చేస్తోన్న పేరిది. దశాబ్దాలుగా కష్టపడి కూడబెట్టిన కోట్ల రూపాయల ఆస్తిని ఒకే ఒక్క సంతకంతో జీజీహెచ్‌కి ధారాదత్తం చేశారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని చాలామంది దాతలు ముందుకు రావడంతో జీజీహెచ్‌కు విరాళాలు వెల్లువలా వచ్చాయి.

రుణం తీర్చుకునేందుకు సిద్ధమైన పూర్వ విద్యార్థులు..

చదువులమ్మ చెట్టు నీడలో కష్టపడిన వాళ్లంతా ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఇన్నేళ్ల ప్రస్థానంలో వేర్వేరు హోదాలకు చేరుకున్నా.. ఎంత ఎత్తుకు ఎదిగినా.. తాము చదువుకున్న విద్యాలయాన్ని వారు మర్చిపోలేదు. తమ విజయానికి బాటలు వేసిన కళాశాల రుణం తీర్చుకునేందుకు ముందుకొచ్చారు గుంటూరు ప్రభుత్వ వైద్యశాల పూర్వవిద్యార్థులు. MCH విభాగానికి 86 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు.

ఎంతో పేరు ప్రఖ్యాతలున్న జీజీహెచ్‌కు జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో రోగులు వస్తుంటారు. పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. లేబర్, గైనిక్ వార్డుల్లో బాలింతలు, పసికందుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. దీనిపై స్పందించిన అమెరికాలో ఉన్న పూర్వ విద్యార్థులు MCH విభాగం నిర్మాణానికి అప్పట్లో ముందుకొచ్చారు. పూర్వ విద్యార్థులంతా కలిసి జింఖానా పేరుతో 30 కోట్లు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరో 35 కోట్ల రూపాయలిచ్చేందుకు అంగీకరించాయి. 650 పడకలతో MCH విభాగ భవన నిర్మాణాన్ని 2019లోనే చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సెల్లార్‌, గ్రౌండ్‌ఫ్లోర్‌, సెకండ్‌ ఫ్లోర్‌ నిర్మించనుండగా.. ఆ తర్వాత 2 నుంచి 5 అంతస్తుల పనులు జింఖానా చేపట్టనుంది. అయితే ఇప్పటికీ భవన నిర్మాణం పునాదుల దశ దాటకపోవడంతో జింఖానా డాక్టర్లు మరోసారి దృష్టి సారించారు. 85 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. దాంతో పనుల్లో స్పీడ్ పెరిగింది.

ఇవి కూడా చదవండి

రూ.22కోట్లు అందించిన ఉమా గవి..

డబ్బే లక్ష్యంగా.. ఆస్తులు కూడబెట్టడమే జీవిత పరమార్థంగా బతుకుతుంటారు కొందరు. ఎంత డబ్బు కూడబెట్టినా దానిపై ఉన్న ఆశ తగ్గదు. అలాంటిది డాక్టర్ ఉమా గవిని.. జీజీహెచ్‌కు ఏకంగా 22కోట్ల రూపాయలు అందించి దానగుణాన్ని చాటుకున్నారు. మువ్వా వెంకటేశ్వరరావు 22 కోట్లు, కృష్ణ ప్రసాద్‌ 11 కోట్ల రూపాయలు చొప్పున విరాళంగా ఇచ్చారు.

గుంటూరు జిల్లాకు చెందిన ఉమా గవిని అమెరికాలో ఇమ్యునాలజిస్ట్‌. ఆమె భర్త మూడేళ్ల క్రితం చనిపోయారు. 1965లో ఆమె గుంటూరు వైద్య కళాశాలలో మెడిసిన్ చదివారు. చదువు పూర్తయ్యాక అమెరికా వెళ్లారు. అక్కడే 40 ఏళ్లుగా డాక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే తాను చదువుకున్న జీజీహెచ్‌కు తన ఆస్తి మొత్తాన్ని రాసిచ్చి స్ఫూర్తిదాతగా నిలిచారు. MCH బ్లాక్‌కి ఉమా భర్త కానూరి రామచంద్రరావు పేరు పెట్టాలని జింఖానా సభ్యులు నిర్ణయించారు. కాగా, మదర్ చైల్డ్ బ్లాక్ నిర్మాణానికి జింఖానా ముందుకు రావడాన్ని స్వాగతించారు సూపరింటెండెంట్‌ ప్రభావతి. ఈ విరాళాలపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని కూడా స్పందించారు. MCH బ్లాక్‌ ఏర్పాటుకి పూర్వ విద్యార్థులు భారీగా విరాళాలు ఇవ్వడం అభినందనీయమన్నారు మంత్రి.

కాగా, వీరితో పాటు చాలామంది పూర్వ విద్యార్థులు విరాళాలు అందించేందుకు సిద్ధమయ్యారు. చదువుకున్న కళాశాలపై మమకారాన్ని మర్చిపోని జింఖానా వైద్యుల స్ఫూర్తి ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

అమెరికాలో భూమికి 200 అడుగుల కింద భారీ బంకర్‌.! అదిరిపోయిన ప్లాన్.
అమెరికాలో భూమికి 200 అడుగుల కింద భారీ బంకర్‌.! అదిరిపోయిన ప్లాన్.
చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..
చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..
కిరాణా షాపులు కనుమరుగయ్యే కాలం వచ్చిందా.? కారణం అదేనా.!
కిరాణా షాపులు కనుమరుగయ్యే కాలం వచ్చిందా.? కారణం అదేనా.!
కదులుతున్న బస్సులో యువకుడు చేసిన పనికి అంతా షాక్‌.! వీడియో..
కదులుతున్న బస్సులో యువకుడు చేసిన పనికి అంతా షాక్‌.! వీడియో..
రైతంటే నువ్వే అన్నా.. నీ ఐడియాకు సలామ్.! వీడియో..
రైతంటే నువ్వే అన్నా.. నీ ఐడియాకు సలామ్.! వీడియో..
"వితౌట్ ఐస్'' అని చెప్పడం మరిచిపోతున్నారా.? అంతే సంగతులు..
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు
చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా.? ఏనుగుల చక్ర వ్యూహం..
తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా.? ఏనుగుల చక్ర వ్యూహం..