MP Asaduddin: అసదుద్దీ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు.. వీథికుక్కలకు ఇచ్చే గౌరవం కూడా ఇవ్వట్లేదంటూ..

బీజేపీ పాలనలో ముస్లింలు చిత్రహింసలకు గురవుతున్నారని విమర్శించారు మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ. వీధికుక్కలకు లభిస్తున్న గౌరవం ముస్లింలకు

MP Asaduddin: అసదుద్దీ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు.. వీథికుక్కలకు ఇచ్చే గౌరవం కూడా ఇవ్వట్లేదంటూ..
Mp Asaduddin Owaisi
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 09, 2022 | 9:30 PM

బీజేపీ పాలనలో ముస్లింలు చిత్రహింసలకు గురవుతున్నారని విమర్శించారు మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ. వీధికుక్కలకు లభిస్తున్న గౌరవం ముస్లింలకు లభిస్తలేదన్నారు. ముస్లిం జనాభా పెరిగిపోతోందని ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం నాడు ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ పై తీవ్రస్థాయిలో మండిపడిన ఆయన.. బీజేపీ పాలనలో ముస్లింల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేస్తూ ప్రధాని మోదీ ముస్లింలను ప్రతి విషయంలో టార్గెట్‌ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. భారత్‌లో వీథికుక్కలకు ఇస్తున్న గౌరవం కూడా ముస్లింలకు ఇవ్వడం లేదని మండిపడ్డారు ఒవైసీ. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలను నేరస్తులుగా, టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తూ దారుణంగా అవమానిస్తున్నారని అన్నారు. దేశంలో ముస్లింల జనాభా పెరిగిపోతుందన్న ఆర్ఎస్ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు ఒవైసీ. ముస్లిం జనాభా వాస్తవానికి తగ్గిపోతోందని అన్నారాయన. కండోమ్స్‌ ఎక్కువగా ముస్లింలే ఉపయోగిస్తున్న విషయాన్ని మోహన్‌ భగవత్‌ గుర్తుంచుకోవాలన్నారు.

కాగా, దసరా నాడు ప్రసంగించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.. తన ప్రసంగంలో దేశ జనాభాపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని మతాల జనాభా పెరుగుతోందన్నారు. అదే సమయంలో హిందువుల జనాభా భారీగా తగ్గుతోందని అన్నారు మోహన్‌ భగవత్‌. ఈ వ్యాఖ్యలపైనే ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్‌గా స్పందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..