Watch Video: కారులో కూర్చని బర్గర్ తింటున్న యువకుడిపై కాల్పులు జరిపిన పోలీస్.. షాకింగ్ విజువల్స్..

అమెరికాలో గన్ కల్చర్ ఎంతో మంది ఉసురు తీస్తోంది. ఉన్మాదులు ఓవైపు విచ్చలవిడిగా కాల్పులు జరుపుతూ జనాల ప్రాణాలను పొట్టన బెట్టుకుంటే..

Watch Video: కారులో కూర్చని బర్గర్ తింటున్న యువకుడిపై కాల్పులు జరిపిన పోలీస్.. షాకింగ్ విజువల్స్..
Us Teen Eating Burger
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 08, 2022 | 7:46 PM

అమెరికాలో గన్ కల్చర్ ఎంతో మంది ఉసురు తీస్తోంది. ఉన్మాదులు ఓవైపు విచ్చలవిడిగా కాల్పులు జరుపుతూ జనాల ప్రాణాలను పొట్టన బెట్టుకుంటే.. పోలీసులు కూడా తమ ఈగో కారణంగా అమాయక ప్రజలపై కాల్పులకు తెగబడుతున్నారు. తాజాగా అమెరికాలో చోటు చేసుకున్న ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారులో కూర్చుని తన పాటికి తాను బర్గర్ తింటున్న ఓ యువకుడిపై పోలీసు అధికారి విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. ఒకటికాదు, రెండు కాదు ఏకంగా 15 రౌండ్లు కాల్పులు జరిపాడు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శాన్ ఆంటోనియోలో ఓ మెక్‌డోనాల్డ్స్ రెస్టారెంట్ ముందు 17 ఏళ్ల యువకుడు ఎరిక్ కాంట్ తన కారును పార్క్ చేసి అందులోనే కూర్చొని బర్గర్ తింటున్నాడు. ఇందులో పోలీస్ అధికారి జేమ్స్ బ్రెన్నాండ్ యువకుడి వద్దకు వచ్చాడు. కారు డోర్ కొట్టాడు. వెంటనే ఆ యువకుడు కారు డోర్ ఓపెన్ చేశాడు. బర్గర్ తింటుండగా, ఇక్కడ ఎందుకు తింటున్నారు? అని ప్రశ్నించాడు. మీరెందుకు అడుగుతున్నారు? మీకేం అవసరం అంటూ యువకుడు ఎదురు ప్రశ్నించాడు. దాంతో కోపోద్రిక్తుడైన పోలీసు.. గన్ను ఎక్కుపెట్టాడు. బెదిరిపోయిన యువకుడు తన కారును ముందుకు తీయబోయాడు. ఇంకేముంది.. మరింత రెచ్చిపోయిన పోలీసు అధికారి తుపాకీతో యువకుడిపై కాల్పులు జరిపాడు. ఒక కాదు రెండు కాదు 15 రౌండ్లు కారుపై కాల్పులు జరిపాడు. అయినప్పటికీ ఆ కాల్పుల నుంచి తప్పించుకునేందుకు యువకుడు కారును ముందుకు పోనిచ్చి తప్పించుకున్నాడు. అయితే, అప్పటికే అతనికి బుల్లెట్ గాయమైంది.

ఇవి కూడా చదవండి

అయితే, పోలీసులు రివర్స్‌గా యువకుడిపైనే కేసు నమోదు చేశారు. నిర్బంధం నుంచి తప్పించుకోవాలని చూడటం, పోలీసు అధికారిపై దాడి చేయడం వంటి అభియోగాలు మోపారు. ఇక కాల్పుల నుంచి తప్పించుకుని పారిపోయిన యువకుడిని కొంత దూరం వెళ్లాక పోలీసులు పట్టుకున్నారు. అతన్ని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. అతని కారును సీజ్ చేశారు. కాగా, ఈ ఘటనపై విచారణలో వాస్తవాలు బయటపడ్డాయి. పోలీసు బాడీ క్యామ్ ఫుటేజీని పరిశీలించిన ఉన్నతాధికారులు.. ఈ ఘటనలో యువకుడి తప్పు ఏమీ లేదని, అతనిపై మోపిన అభియోగాలన్నీ కొట్టేశారు. అలాగే యువకుడి కారులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని ప్రకటించారు.

వాస్తవానికి డిస్ట్రబెన్స్ కాల్ వచ్చిందని, ఆ కారులోని వారే డిస్ట్రబ్ చేస్తున్నారని భావించిన ఆఫీసర్ బ్రెన్నాండ్ అక్కడికి వెళ్లారని ఉన్నతాధికారులు తెలిపారు. కారు ఒక్కసారిగా ముందుకు కదలడంతో అటాక్ చేస్తారనే ఉద్దేశ్యంతో అతను కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. అయితే, బ్రెన్నాండ్ చర్యను సమర్థించడం లేదని, దీనిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. వాస్తవానికి కదులుతున్న వాహనాలపై కాల్పులు జరుపడం నిషేధం అని, ప్రాణ రక్షణ కోసం తప్ప మరే సందర్భంలోనూ కదులుతున్న వాహనాలపై కాల్పులు జరుపకూడదన్నారు. కానీ, ఈ ఘటనలో ఇక్కడ ప్రాణాపాయ స్థితి ఏమీ లేదని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మొత్తంగా బ్రెన్నాండ్ కాల్పుల ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు.. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..