Indo American: కాలిఫోర్నియాలో దారుణం.. కోడల్ని వెంటాడి మరీ చంపేసిన మామ.. కారణమేంటంటే?
కోడలిని హత్య చేసేందుకు ఫ్రెస్నోలో నుంచి 150 మైళ్లు ప్రయాణించి శాంజోస్‌కు వెళ్లాడు. వాల్‌మార్ట్ పార్కింగ్ ఏరియాలో కోడలికి తుపాకీతో కాల్చేశాడు. పోలీసులు సీతల్ సింగ్ దోసాంజ్‌ను అరెస్టు చేశారు. ఆయన ఇంటిని సోదా చేయగా పిస్టల్ దొరికింది.
వరుస హత్యలు అగ్రరాజ్యంలోని భారతీయ సమాజాన్ని కలవరపరుస్తున్నాయి. కాలిఫోర్నియాలోని శాంజోస్‌లో వారం క్రితం జరిగిన ఆలస్యంగా బయటపడింది. సీతల్ సింగ్ దోసాంజ్ అనే వ్యక్తి అక్కడి వాల్‌మార్ట్‌లో పని చేసే తన కోడలు గురుప్రీత్ కౌర్ దోసాంజ్‌ని హత్య చేశాడు. తన కుమారునికి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకోవడమే ఆమె చేసిన పాపం. కోడలిని హత్య చేసేందుకు ఫ్రెస్నోలో నుంచి 150 మైళ్లు ప్రయాణించి శాంజోస్‌కు వెళ్లాడు. వాల్‌మార్ట్ పార్కింగ్ ఏరియాలో కోడలికి తుపాకీతో కాల్చేశాడు. పోలీసులు సీతల్ సింగ్ దోసాంజ్‌ను అరెస్టు చేశారు. ఆయన ఇంటిని సోదా చేయగా పిస్టల్ దొరికింది. కాగా నాలుగు రోజుల క్రితం కాలిఫోర్నియాలోని మెర్సిడ్‌లో నలుగురు భారతీయులను కిడ్నాప్ చేసి హత్య చేయడం కలకలం రేపింది. జస్దీప్ సింగ్, ఆయన భార్య జస్లీర్ కౌర్, వారి కూతురు అరూహీతో పాటు ఈ కుటుంబానికి దగ్గర బంధువు అమన్ దీప్ సింగ్ మృత దేహాలను ఓ తోటలో గుర్తించారు. పంజాబ్‌లోని హర్సీకి చెందిన వీరు కొంత కాలంగా అమెరికాలో నివసిస్తున్నారు. పోలీసులు ఈ కేసులో ఇప్పటి వరకూ ఇద్దరిని అరెస్టు చేశారు.
అంతకుముందు ఇండియానా పోలిస్‌లోని పుర్డూ విశ్వవిద్యాలయంలో డేటా సైన్స్ చదువుతున్న వరుణ్ మనీష్ ఛేడా హత్యకు గురయ్యారు. వరుణ్‌కు ఆయన రూమ్‌మేట్ అయిన కొరియన్ విద్యార్థి హత్య చేసినట్టు గుర్తించి అరెస్టు చేశారు.. వారం రోజుల వ్యవధిలో జరిగిన ఆరుగురు భారతీయులు హత్యకు గురవడం అక్కడి ఇండియన్ కమ్యూనిటీని తీవ్రంగా కలచివేసింది. ఆw వారం రోజుల వ్యవధిలో ఆరుగురు హత్యకు కావడంతో అమెరికాలోని భారతీయులు ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..