AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Kabaddi: మేం ఎవరికన్నా తక్కువా? చీరకట్టులో కబడ్డీ ఆడి అదరగొట్టిన మహిళలు

మహిళలైతే ఫ్యాంటూ టీషర్ట్‌ ధరించడం కామన్‌. అయితే, ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన గ్రామీణ క్రీడల్లో చీరకట్టులోనే కబడ్డీ ఆడి వావ్‌ అనిపించారు మహిళలు. చీరకట్టులో గ్రౌండ్‌లోకి దిగడమే కాదు ప్రొఫెషనల్‌ ఆటగాళ్లలా కూత పెడుతూ కేక పుట్టించారు లేడీస్‌.

Women Kabaddi: మేం ఎవరికన్నా తక్కువా? చీరకట్టులో కబడ్డీ ఆడి అదరగొట్టిన మహిళలు
Women Kabaddi
Basha Shek
|

Updated on: Oct 11, 2022 | 2:43 PM

Share

కబడ్డీ.. మన దేశంలో ఈ ఆట తెలియని వారుండరు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఆటకు ఆదరణ బాగా ఉంటుంది. ఆడడానికే కాదు చాలామంది ఈ గేమ్‌ను చూడ్డానికి కూడా ఇష్టపడతారు. అందుకే ఇది మన జాతీయ క్రీడగా మారిపోయింది. ఇదిలా ఉంటే కబడ్డీ గ్రౌండ్‌లోకి దిగి కూత పెట్టాలంటే దానికో సెపరేట్‌ కాస్ట్యూమ్‌ మస్ట్‌. మగవాళ్లయితే నిక్కరు అండ్‌ టీషర్ట్‌. మహిళలైతే ఫ్యాంటూ టీషర్ట్‌ ధరించడం కామన్‌. అయితే, ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన గ్రామీణ క్రీడల్లో చీరకట్టులోనే కబడ్డీ ఆడి వావ్‌ అనిపించారు మహిళలు. చీరకట్టులో గ్రౌండ్‌లోకి దిగడమే కాదు ప్రొఫెషనల్‌ ఆటగాళ్లలా కూత పెడుతూ కేక పుట్టించారు లేడీస్‌. చుట్టూ భారీగా జనం నిలబడి చూస్తున్నా, ఎలాంటి మొహమాటం లేకుండా కబడ్డీ ఆడారు మహిళలు. తలపై కప్పుకున్న కొంగు జారిపోతున్నా కూడా తగ్గేదేలే అంటూ గ్రౌండ్‌లో కూత పెట్టారు లేడీస్‌. జనం కూడా ఉత్సాహంగా కేకలేస్తూ మహిళలను ప్రోత్సహించారు.

దీనికి సంబంధించిన ఈ వీడియోను ఛత్తీస్‌గఢ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ అవనీస్‌ శరణ్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. మేం ఎవరికన్నా తక్కువా? ఛత్తీస్‌గఢ్‌ ఒలింపిక్స్‌లో మహిళల కబడ్డీ ఇది అని దీనికి క్యాప్షన్‌ పెట్టారు అవనీస్‌. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళల కబడ్డీ వీడియోకు లక్షల్లో వ్యూస్‌, వేలల్లో లైక్స్‌, రీట్వీట్స్‌ వస్తున్నాయ్‌. చీరకట్టులో మహిళల కబడ్డీ భలేగా ఉందని, ప్రొఫెషన్స్‌లా ఆడారంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. తామంతా చిన్నప్పుడు స్కూల్లో ఆడుకునేవాళ్లమని.. కొందరు తమ అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. కాగా చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేంద్ర బాఘెల్ కబడ్డీలాంటి సాంప్రదాయ క్రీడలను పోత్సహించేందుకు చత్తీస్‌గఢ్ ఒలంపిక్స్ పేరుతో ఈ క్రీడలను ప్రారంభించారు. కబడ్డీ, గిల్లిదండా, పిట్టూల్, లాంగ్డి రన్, బంతి, బిల్లాస్ వంటి మరెన్నో క్రీడలు ఉన్నాయి. ఈ క్రీడల్లో మహిళల నుంచి పరుషుల వరకు వేర్వేరు విభాగాల్లో క్రీడల్లో పాల్గొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..