AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bear Fight: రోడ్డు మధ్యలో పొట్టుపొట్టుగా పోట్లాడుకున్న ఎలుగుబంట్లు.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే

ఎలుగుబంట్లను కూడా క్రూర జంతువులుగానే భావిస్తారు. ఇవి చాలా శక్తివంతమైనవి. అడవికి రాజైన సింహాలతో సైతం పోరాడే శక్తి వీటికి ఉంటుంది. ఈనేపథ్యంలో రెండు ఎలుగుబంట్ల మధ్య పోట్లాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Bear Fight: రోడ్డు మధ్యలో పొట్టుపొట్టుగా పోట్లాడుకున్న ఎలుగుబంట్లు.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే
Bear Fight
Basha Shek
|

Updated on: Oct 09, 2022 | 8:38 AM

Share

ప్రపంచవ్యాప్తంగా వేల జాతుల జంతువులు ఉన్నప్పటికీ, వాటిలో కొన్ని మాత్రమే పెంపుడు జంతువులు. వీటిలో కుక్కలు, పిల్లులు, గుర్రాలు మరియు ఏనుగులు మొదలైనవి ఉన్నాయి. ఇక అడవల్లో తిరిగే సింహాలు, పులులు చాలా ప్రమాదకరమైనవి. ఇవే కాకుండా ఎలుగుబంట్లను కూడా క్రూర జంతువులుగానే భావిస్తారు. ఇవి చాలా శక్తివంతమైనవి. అడవికి రాజైన సింహాలతో సైతం పోరాడే శక్తి వీటికి ఉంటుంది. ఈనేపథ్యంలో రెండు ఎలుగుబంట్ల మధ్య పోట్లాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లకు ఆశ్చర్యం కలిగిస్తోంది. వైరల్‌ అవుతోన్న ఈ వీడియోలో ఎలుగుబంట్లు మొదట రోడ్డుపక్కన హాయిగా నిలబడి ఉంటాయి. అయితే ఏమైందో తెలియదు కానీ ఒక్కసారిగా రెండూ కాళ్లపై నిలబడి గొడవకు దిగుతాయి. పరస్పరం తోసుకుంటూ రోడ్డు మధ్యలోకి చేరుకుంటాయి. సమయం గడిచేకొద్దీ ఒకదానిపై మరొకరు పడుతూ మరింత పొట్టు పొట్టుగా పోట్లాడుకుంటాయి.

ఇంతలో వాహనాల సైరన్‌ శబ్ధం వినిపించడంతో పోట్లాట ఆపి పరుగు మొదలు పెడతాయి. సింహం, పులి, చిరుతపులి వంటి జంతువులతో సహా వివిధ రకాల జంతువులతో పోరాడే వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, ఎలుగుబంట్లు ఇలా పోరాడడం చాలా అరుదు. అందుకే ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు.@Animalesybichos అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఈ 59 సెకన్ల నిడివి గల ఈ వీడియోకు ఇప్పటివరకు వేల సంఖ్యలో వ్యూస్‌ వచ్చాయి. వందలాది మంది ఈ వీడియోను లైక్ చేసారు. అలాగే భిన్న రకాలుగా స్పందించారు.

ఇవి కూడా చదవండి

కొన్ని ఎలుగుబంట్లు ఇలాగే కొట్టుకుంటాయని, ఒక్కోసారి ప్రాణం పోయేంతవరకు పొట్లాడతాయని నెటిజన్లు చెబుతున్నారు. అయితే ఈ వైరల్ వీడియోలో అలాంటిదేమీ కనిపించకపోవడం గమనార్హం.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..