AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Thief: ఇలాంటి వింత దొంగను ఎప్పుడైనా చూశారా.. డ్రైనేజ్ పై ఇనుప నెట్ చోరీ.. ఫన్నీ వీడియో వైరల్

కొంతమంది దొంగలు తమ చేతులకు పని చెబుతున్నారు. ఇనుప వస్తువులను దొంగిలిస్తున్నారు. ప్రస్తుతం అలాంటి దొంగ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి మీరు కూడా స్టన్ అవుతారు.

Funny Thief: ఇలాంటి వింత దొంగను ఎప్పుడైనా చూశారా.. డ్రైనేజ్ పై ఇనుప నెట్ చోరీ.. ఫన్నీ వీడియో వైరల్
Funny Thief Video
Surya Kala
|

Updated on: Oct 09, 2022 | 10:10 AM

Share

అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల కాదేది కవితకు అనర్హం అన్న శ్రీ.. శ్రీ మాటలను కొంతమందిని దొంగలు తమకు అనుకూలంగా మలచుకున్నారో ఏమో.. కాదేదీ దొంగతనానికి కనర్హం అంటున్నారు. నగలు, నగదు, కార్లు, మోటార్ బైక్స్ వంటి వాటినే కాదు.. బట్టలు, కూరగాయలు వంటి అనేక వస్తువులను కూడా దొంగలిస్తున్న దొంగలను చూసి ఉంటారు. అవును ప్రస్తుతం కాలంలో దొంగలు కూడా అద్భుతంగా మారారు. ఇప్పుడు దొంగలు మ్యాన్‌హోల్ మూతలను, కాలువలపై ఇనుప వలలు వంటి వింత వస్తువులను దొంగిలించడం కూడా మొదలు పెట్టారు. దీనికి కారణం ఇనుము ధర విపరీతంగా పెరిగిపోవడమే.  దొంగలు ఇనుముని దొంగలించి వాటిని తిరిగి అమ్ముకుంటున్నారు. అటువంటి పరిస్థితిలో అవకాశం లభించిన వెంటనే.. కొంతమంది దొంగలు తమ చేతులకు పని చెబుతున్నారు. ఇనుప వస్తువులను దొంగిలిస్తున్నారు. ప్రస్తుతం అలాంటి దొంగ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి మీరు కూడా స్టన్ అవుతారు. ఈ దొంగ చాలా విచిత్రం అని అంటారు.

డబ్బు, నగలు దోచుకెళ్లే దొంగలను మీరు చూసి ఉంటారు. చాలా మంది దొంగలు పట్టపగలు ఎవరినైనా దోచుకుంటున్నారు. దారిలో మనుషులను దోచుకోవడమే కాదు.. కొన్ని సార్లు ఇళ్లు, దుకాణాలను కూడా దోచుకెళ్తున్నారు. కానీ డ్రెయిన్ల మీద వేసిన ఇనుప మూతలను దొంగిలించే దొంగ చాలా అరుదు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాత్రి సమయం.. చీకటితో నిండిపోయింది. ఈ చీకటిని సద్వినియోగం చేసుకోవడానికి, ఒక దొంగ స్కూటీపై వచ్చాడు. డైనేజ్ హోల్ మీద పెట్టిన  పెద్ద ఇనుప వల తీసుకుని స్కూటీ మీద పెట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ దొంగను చూస్తే మీకు కూడా నవ్వు వస్తుంది. అదే  సమయంలో కోపం వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఫన్నీ దొంగతనం

ఈ ఫన్నీ దొంగతనం వీడియో @navalkant అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. ‘మీకు డ్రైన్ నెట్ ఉచితంగా కావాలంటే, మీరు కూడా దీనిని అనుసరించవచ్చు అని  ఆ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఘటన ఘజియాబాద్‌లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్కూటీ మీద ఒక వ్యక్తి వచ్చాడు డ్రెయిన్ మీద ఉన్న ఇనుప వలను తీసుకుని అక్కడ నుంచి వెళ్ళాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

ఈ 56 సెకన్ల వీడియోను ఇప్పటివరకు వేలాది వ్యూస్ సొంతం చేసుకోగా.. రకరకాల ఫన్నీ రియాక్షన్‌లు ఇచ్చారు.  ఫన్నీ దొంగ అంటూ కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..