Rashmika Mandanna: బిగ్‌బాస్‌లో సందడి చేసిన శ్రీవల్లి.. సల్లూభాయ్‌తో కలిసి సామీ నా సామీ అంటూ అదిరిపోయే స్టెప్పులు

హోస్ట్‌ సల్మాన్‌ ఖాన్‌ రష్మిక, నీనా గుప్తాలకు సాదరంగా స్వాగతం పలికాడు. అనంతరం తన షోలోని కంటెస్టెంట్లను రష్మిక, నీనాలకు పరిచయం చేశాడు. కాగా సల్మాన్‌ని తెలుగులో తన పాపులర్ డైలాగ్స్ చెప్పమని రష్మిక కోరగా.. కొన్ని తెలుగు డైలాగులు చెప్పి అలరించాడు సల్లూ భాయ్‌

Rashmika Mandanna: బిగ్‌బాస్‌లో సందడి చేసిన శ్రీవల్లి.. సల్లూభాయ్‌తో కలిసి సామీ నా సామీ అంటూ అదిరిపోయే స్టెప్పులు
Salman Khan, Rashmika
Follow us
Basha Shek

|

Updated on: Oct 09, 2022 | 7:58 AM

బెంగళూరు బ్యూటీ రష్మిక మందాన్న క్రేజ్‌ ప్రస్తుతం మాములుగా లేదు. పుష్ప సినిమాతో నేషనల్‌ వైడ్‌గా పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ హిందీలోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ తో ఆమె కలిసి నటించిన గుడ్‌బై అక్టోబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళుతోన్న ఈ చిత్రాన్ని మరింత ప్రమోట్‌ చేయాలనుకుంటోంది చిత్రబృందం. ఇందులో భాగంగా రష్మిక హిందీ బిగ్‌బాస్‌లో అడుగుపెట్టింది. ఆమెతో పాటు నీనాగుప్తా ఈ రియాలిటీ షోలో సందడి చేశారు. ఈ సందర్భంగా హోస్ట్‌ సల్మాన్‌ ఖాన్‌ రష్మిక, నీనా గుప్తాలకు సాదరంగా స్వాగతం పలికాడు. అనంతరం తన షోలోని కంటెస్టెంట్లను రష్మిక, నీనాలకు పరిచయం చేశాడు. కాగా సల్మాన్‌ని తెలుగులో తన పాపులర్ డైలాగ్స్ చెప్పమని రష్మిక కోరగా.. కొన్ని తెలుగు డైలాగులు చెప్పి అలరించాడు సల్లూ భాయ్‌. అదేవిధంగా పుష్ప సినిమాలోని సామీ నా సామీ పాటకు సల్మాన్‌, రష్మికలిద్దరూ ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశారు. నీనా కూడా వీరితో కాలు కదిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అప్పుడు గోవిందా.. ఇప్పుడు సల్మాన్‌..

కొద్దిరోజుల క్రితం ప్రముఖ రియాలిటీ షో సూపర్‌ మామ్స్‌-3 గ్రాండ్‌ ఫినాలేలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు గోవిందాతో కలిసి ఇదే పాటకు హుషారుగా డ్యాన్స్‌ చేసి ఉర్రూతలూగించింది రష్మిక. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా గుడ్‌బై’ చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలిరోజు రూ.1.20 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రంలో దివంగత నటుడు అరుణ్ బాలి, సునీల్ గ్రోవర్, పావైల్ గులాటి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో రష్మిక అమితాబ్ బచ్చన్- నీనా గుప్తా కుమార్తెగా నటించింది.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల సీతారామం సినిమాలో అఫ్రీన్‌ పాత్రలో అదరగొట్టింది రష్మిక. త్వరలోనే బిగ్‌ బీ కలిసి గుడ్‌ బై చెప్పేందుకు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అలాగే ప్రస్తుతం తెలుగులో పుష్ప2తో పాటు, విజయ్‌ దళపతితో కలసి వారసుడు చిత్రాల్లో నటిస్తోంది. ఇక బాలీవుడ్‌లో మిషన్‌ మజ్నూ, యానిమల్‌ చిత్రాలతో బీటౌన్‌ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది.

View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..