Anna Rajan: సిమ్ కొనేందుకు వెళ్లిన నటి.. గదిలో బంధించిన టెలికాం సిబ్బంది.. విచారణలో షాకింగ్ విషయాలు..

సిమ్ కొనేందుకు వెళ్లిన ఆమెను షోరూం సిబ్బంది గదిలో బంధించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆమెను విడిచిపెట్టారు. అంతేకాకుండా పోలీసు విచారణలో షాకింగ్ విషయాలు

Anna Rajan: సిమ్ కొనేందుకు వెళ్లిన నటి.. గదిలో బంధించిన టెలికాం సిబ్బంది.. విచారణలో షాకింగ్ విషయాలు..
Anna Rajan
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 09, 2022 | 7:57 AM

చిత్రపరిశ్రమలోని నటీమణులపై కొందరు అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. పలు ఈవెంట్స్.. పబ్లిక్ ప్రదేశాలలో వారికి అనేకసార్లు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇటీవల సినిమా ప్రమోషనల్లో పాల్గోన్న ఇద్దరు హీరోయిన్స్‎తో అభిమానులు అసభ్యంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే మరో ఘటన జరిగింది. మలయాళీ నటి అన్నా రాజన్‏కు కూడా అలాంటి సమస్యను ఎదుర్కొంది. సిమ్ కొనేందుకు వెళ్లిన ఆమెను షోరూం సిబ్బంది గదిలో బంధించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆమెను విడిచిపెట్టారు. అంతేకాకుండా పోలీసు విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.

అన్నా రాజన్ ‘అంగమాలి డైరీస్’ సినిమాతో మాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తక్కువ సమయంలోనే స్టార్ నటులతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న అన్న రాజన్ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. సిమ్ కార్డు కొనేందుకు వెళ్లిన ఆమెను ఓ ప్రైవేట్ టెలికాం కంపెనీ సిబ్బంది షోరూంలో కార్నర్ చేసిన ఘటన కేరళలో చోటుచేసుకుంది.

కొద్దిరోజుల క్రితం అన్నా రాజన్ తన సిమ్ పోగొట్టుకుంది. దీంతో కొత్త సిమ్ కోసం ప్రైవేట్ టెలికమ్యూనికేషన్ కార్యాలయానికి వెళ్లింది. ముఖానికి మాస్క్ కట్టుకుని వెళ్లిన ఆమె.. ఓ సాధారణ అమ్మాయిగా అక్కడి సిబ్బందితో మాట్లాడింది. ఇక తర్వాత సిబ్బంది ఆమెతో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా ఆమెను ఓ గదిలో బంధించారు. ఆమె తన స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే షోరూంకు చేరుకున్న పోలీసులును ఆమెను విడిపించారు. తాము బంధించిన అమ్మాయి నటి అని తెలియడంతో అక్కడి సిబ్బంది షాకయ్యారు. తర్వాత వారు అన్నా రాజన్ కు క్షమాపణలు చెప్పడంతో ఆమె కేసు వెనక్కు తీసుకున్నారు.

View this post on Instagram

A post shared by anna rajan (@annaspeeks)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.