AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Easter Island: ప్రకృతి ప్రకోపం.. ఈస్టర్‌ ఐలాండ్‌ను చుట్టేసిన లావా.. కాలిపోయిన ప్రపంచ ప్రఖ్యాత మోయి విగ్రహాలు

పెద్ద పెద్ద తలలతో కనిపించే ఈ విగ్రహాల వెనుక మిస్టరీ ఏమిటో ఎవరికీ అంతు పట్టలేదు. ఈస్టర్‌ ఐలాండ్‌ ద్వీపంలో నివసించిన మూలవాసులైన రాపానుయ్‌ వాసులు 13వ శతాబ్దంలో ఈ శిలా విగ్రహాలను రూపొందించారని చరిత్ర చెబుతోంది.  వీటిని మోయి విగ్రహాలు అని పిలుస్తారు.

Easter Island: ప్రకృతి ప్రకోపం.. ఈస్టర్‌ ఐలాండ్‌ను చుట్టేసిన లావా.. కాలిపోయిన ప్రపంచ ప్రఖ్యాత మోయి విగ్రహాలు
Easter Island statues
Follow us
Basha Shek

|

Updated on: Oct 09, 2022 | 8:45 AM

పసిఫిక్‌ మహాసముద్రంలోని ఈస్టర్‌ ఐలాండ్‌ ద్వీపానికి ఒక ప్రత్యేకత ఉంది. చిత్ర విచిత్రమైన శిలలు ఇక్కడ కనిపిస్తాయి. చిలీ దేశ పశ్చిమ తీరానికి మూడున్నర వేల కిలో మీటర్ల రూంలో ఈ అద్భుత ద్వీపం ఉంది. ఇక్కడ 887 శిలా విగ్రహాలు ఉన్నాయి. పెద్ద పెద్ద తలలతో కనిపించే ఈ విగ్రహాల వెనుక మిస్టరీ ఏమిటో ఎవరికీ అంతు పట్టలేదు. ఈస్టర్‌ ఐలాండ్‌ ద్వీపంలో నివసించిన మూలవాసులైన రాపానుయ్‌ వాసులు 13వ శతాబ్దంలో ఈ శిలా విగ్రహాలను రూపొందించారని చరిత్ర చెబుతోంది.  వీటిని మోయి విగ్రహాలు అని పిలుస్తారు. యునెస్కో ఈ ద్వీపాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. అయితే దురదృష్టవశాత్తు ఈస్టర్‌ ఐలాండ్‌ ద్వీపం ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకుంది. రాపా నుయ్ జాతీయ ఉద్యానవనంలో అగ్ని పర్వతం పేలడంతో లావా ఎగజిమ్మి ద్వీపమంతా ప్రవహించింది. ఈ మంటలకు మోయి విగ్రహాలు కాలిపోయి సహజ ఆకృతిని కోల్పోయాయి.

కాగా ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా తాను భావించడం లేదంటున్నారు. ఈస్టర్ ఐలాండ్ మేయర్ పెడ్రో ఎడ్మండ్స్ పావో. మంటలు చెలరేగడానికి మనుషులే కారణమని ఆయన అనుమానిస్తున్నారు. కరోనా సంక్షోభానికి ముందు ఈస్టర్‌ ఐలాండ్‌కు ప్రతి ఏటా లక్షన్న మంది పర్యాటకులు వచ్చేవారు. రోజూ రెండు విమానాలు నడిచేవి. చిలీకి పర్యాటకుల రూపంలో భారీగా ఆదాయం వచ్చేది. కరోనా తర్వాత పర్యాటకుల సంఖ్య తగ్గడంతో ఈ దీవులను సంరక్షించేందుకు కూడా ఆదాయం చాలడం లేదంటున్నారు. కాగా ప్రపంచ ప్రఖ్యాత శిలా విగ్రహాలు లావా కారణంగా దెబ్బతినడంపై ప్రకృతి, పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..