America: భారత్‌లోని ఆ ప్రాంతాలకు అసలు వెళ్లద్దు.. తమ దేశ పౌరులకు అమెరికా హెచ్చరిక

ఉత్తర తెలంగాణ నుంచి బెంగాల్‌లోని పశ్చిమ భాగం వరకూ విస్తరించిన ప్రాంతంలో తన పౌరులకు అత్యవసర సేవలు అందించే సామర్థ్యం అమెరికా ప్రభుత్వానికి పరిమితంగా ఉంటుందని వివరించింది. తమ ఉద్యోగులు అక్కడికి వెళ్లాలంటే ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుందని తెలిపింది

America: భారత్‌లోని ఆ ప్రాంతాలకు అసలు వెళ్లద్దు.. తమ దేశ పౌరులకు అమెరికా హెచ్చరిక
American Citizens
Follow us
Basha Shek

|

Updated on: Oct 09, 2022 | 9:30 AM

భారత్‌లో పర్యటించే తమ పౌరులకు కీలక సూచనలు చేసింది అమెరికా. నేరాలు, ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో భారత్‌లో పర్యటించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అమెరికా సూచించింది. భారత్‌లోని ఆయా ప్రాంతాల్ని ప్రత్యేకంగా పేర్కొంది అమెరికా. ఈ ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లొద్దని చెప్పింది. అమెరికా సూచించిన ప్రాంతాల్లో తెలంగాణ సైతం ఉంది. ఉత్తర తెలంగాణ నుంచి బెంగాల్‌లోని పశ్చిమ భాగం వరకూ విస్తరించిన ప్రాంతంలో తన పౌరులకు అత్యవసర సేవలు అందించే సామర్థ్యం అమెరికా ప్రభుత్వానికి పరిమితంగా ఉంటుందని వివరించింది. తమ ఉద్యోగులు అక్కడికి వెళ్లాలంటే ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుందని తెలిపింది. ఇక.. జమ్మూ-కశ్మీర్‌కు మాత్రం అస్సలు వెళ్లొద్దని హెచ్చరించింది అమెరికా. భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దులకు 10 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాల్లోనూ పర్యటించొద్దని, అక్కడ సైనిక ఘర్షణకు ఆస్కారం ఉందని తెలిపింది.

పర్యాటక ప్రదేశాలు, రవాణా హబ్‌లు, మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌, ప్రభుత్వ ప్రాంగణాలపై ఉగ్రవాదులు ఎలాంటి హెచ్చరిక లేకుండానే దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే భారత్‌లో ముప్పు స్థాయిని ‘లెవల్‌-2’కు తగ్గించింది. లెవల్‌-4ను గరిష్ఠ స్థాయిగా పరిగణిస్తారు. అంతకుముందు పాక్‌ను లెవల్‌-3లో అమెరికా ఉంచింది. ఆ దేశాన్ని సందర్శించే అంశంపై పునరాలోచన చేయాలని తన పౌరులకు సూచించింది. ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డగా ఉండే కల్లోలిత ప్రావిన్స్‌లకు వెళ్లవద్దని కోరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..