AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gunasekhar: గ్రాండ్‌గా డైరెక్టర్‌ గుణశేఖర్‌ కూతురి నిశ్చితార్థం.. వరుడు ఎవరో తెలుసా?

తన కూతురి ఎంగేజ్‌మెంట్‌ విషయాన్ని గుణశేఖర్ సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈరోజు తమకు స్పెషల్ డే అని తన ఆనందాన్ని షేర్‌ చేసుకున్నారు. అనంతరం కూతురు నీలిమ సైతం తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

Gunasekhar: గ్రాండ్‌గా డైరెక్టర్‌ గుణశేఖర్‌ కూతురి నిశ్చితార్థం.. వరుడు ఎవరో తెలుసా?
Gunasekhar Daughter
Basha Shek
|

Updated on: Oct 09, 2022 | 6:24 AM

Share

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కుమార్తె నీలిమ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. . తాజాగా హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో కాబోయే వరుడు రవి ప్రక్యాతో ఆమె నిశ్చితార్థం వేడుకగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. కాబోయే వధూవరులను మనసారా ఆశీర్వదించారు. కాగా తన కూతురి ఎంగేజ్‌మెంట్‌ విషయాన్ని గుణశేఖర్ సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈరోజు తమకు స్పెషల్ డే అని తన ఆనందాన్ని షేర్‌ చేసుకున్నారు. అనంతరం కూతురు నీలిమ సైతం తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ‘నా జీవిత ప్రయాణం మొదలైంది’ అంటూ తన ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలను షేర్‌ చేసింది.

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నెటిజన్లు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. చూడాలని ఉంది, ఒక్కడు, అర్జున్‌, రుద్రమ దేవి తదితర సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్‌ గుణశేఖర్‌. నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకున్నారు. ఇక నీలిమ విషయానికొస్తే.. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఆమె కూడా తండ్రి అడుగుజాడల్లో నడిచింది. నిర్మాతగా మారింది. అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్‌ తెరకెక్కించిన రుద్రమ దేవికి చిత్రానికి ఆమె సహ నిర్మాతగా వ్యవహరించింది. ప్రస్తుతం శాకుంతలం చిత్రానికి నిర్మాతగా పనిచేస్తోంది. ఇందులో సమంత ప్రధాన పాత్ర పోషించింది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్‌ 4న తెలుగుతో పాటు తమిళ్‌, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. అయితే నీలిమతో జీవితం పంచుకుంటోన్న రవి ప్రక్యా గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
అద్భుతాలు జరుగుతాయ్.. ఉదయాన్నే బొప్పాయి తింటే శరీరంలో జరిగేదిదే..
అద్భుతాలు జరుగుతాయ్.. ఉదయాన్నే బొప్పాయి తింటే శరీరంలో జరిగేదిదే..
ఆ ఒక్క మాటే రోహిత్ రికార్డ్‌ను బద్దలు కొట్టేలా చేసింది
ఆ ఒక్క మాటే రోహిత్ రికార్డ్‌ను బద్దలు కొట్టేలా చేసింది
ప్రహరీ గోడ కడుతున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే బీటలు వారడం ఖాయం!
ప్రహరీ గోడ కడుతున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే బీటలు వారడం ఖాయం!
రాత్రికి రాత్రే గణేషుడి మెడలోని నోట్ల దండను కొట్టేసిన కేటుగాళ్లు!
రాత్రికి రాత్రే గణేషుడి మెడలోని నోట్ల దండను కొట్టేసిన కేటుగాళ్లు!
జపాన్‌తో చారిత్రాత్మక మ్యాచ్.. మారిన టీమిండియా ఓపెనర్లు.. ఎవరంటే?
జపాన్‌తో చారిత్రాత్మక మ్యాచ్.. మారిన టీమిండియా ఓపెనర్లు.. ఎవరంటే?
రియాద్‌ టార్గెట్‌గా చెలరేగిన హౌతీలు.. ఇరాన్‌లో అమల్లోకి కోడ్ 100
రియాద్‌ టార్గెట్‌గా చెలరేగిన హౌతీలు.. ఇరాన్‌లో అమల్లోకి కోడ్ 100
అందరికి చుక్కలు చూపించిన నాగ్.. వీడియోస్ చూపించి మరీ ఊతికారేసాడు.
అందరికి చుక్కలు చూపించిన నాగ్.. వీడియోస్ చూపించి మరీ ఊతికారేసాడు.
ట్రైథ్లాన్ ఈవెంట్‌లో తొలి గోల్డ్ పట్టేసిన ఆతిథ్య దేశం..!
ట్రైథ్లాన్ ఈవెంట్‌లో తొలి గోల్డ్ పట్టేసిన ఆతిథ్య దేశం..!
రేకుల షెడ్డులో వేడితో తట్టుకోలేకపోతున్నారా? ఇలా చేస్తే కూల్ కూల్
రేకుల షెడ్డులో వేడితో తట్టుకోలేకపోతున్నారా? ఇలా చేస్తే కూల్ కూల్
యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం
యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం