Godfather: ఇదేం మాస్ రా మావా.. థియేటర్‌లో టపాసులు కాల్చిన ఫ్యాన్స్.. పరుగులు తీసిన ప్రేక్షకులు
గాడ్‌ఫాదర్ సినిమా ప్రదర్శితమవుతోన్న ఓ థియేటర్‌లో అభిమానులు అత్యుత్సాహం చూపించారు. థియేటర్‌లోనే టపాసులు కాల్చి హడావిడి చేశారు. దీంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులు వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్‌ఫాదర్. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ఖాన్‌తో పాటు నయనతార, సత్యదేవ్, పూరీ జగన్నాథ్, అనసూయ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మోహన్ రాజా దర్శకత్వం వహించగా రామ్‌చరణ్, ఆర్ బీ చౌదరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్‌హిట్ టాక్ సొంతం చేసుకుంది. సౌత్‌తో పాటు నార్త్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇదిలా ఉంటే గాడ్‌ఫాదర్ సినిమా ప్రదర్శితమవుతోన్న ఓ థియేటర్‌లో అభిమానులు అత్యుత్సాహం చూపించారు. థియేటర్‌లోనే టపాసులు కాల్చి హడావిడి చేశారు. దీంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులు వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మహారాష్ట్రలోని మాలేగావ్‌లోని ఓ థియేటర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సినిమాలో తార్‌మార్ సాంగ్ ప్లే అవుతోన్న సమయంలో కొంతమంది అభిమానులు థియేటర్‌లోనే బాణసంచా పేల్చారు . దీంతో థియేటర్‌లో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. సినిమా చూస్తున్న ప్రేక్షకులు థియేటర్ బయటకు పరుగులు తీశారు. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇదెక్కడి మాస్ రా మావా’ అని కొందరు కామెంట్లు చేస్తుంటే మరికొందరు థియేటర్‌లో ఇలాంటి పనులు అసలు సహించ రాదు అంటూ హితబోధ చేస్తున్నారు.
గతంలోనూ..
కాగా సల్మాన్ నటించిన అంతిమ్ సినిమా రిలీజైనప్పుడు కూడా కొందరు అభిమానులు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న సల్లూ భాయ్ ఇలాంటి పనులు చేయవద్దని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు. కానీ అభిమానులు మాత్రం పెడచెవిన పెట్టారు. గాడ్‌ఫాదర్ సినిమా థియేటర్లోనూ మళ్ల అదే పని చేశారు. కాగా ఈసినిమాలో సల్మాన్ మసూం భాయ్ పాత్రలో నటించారు. స్ర్కీన్‌పై కనిపించేంది కొద్దిసేపే అయినా సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారాయన.
Imagine what happen when tiger 3 release ??? Mass hysteria #SalmanKhan? #GodFather #Chiranjeevi pic.twitter.com/ZYJBcMFmyE
— Abhishek❤️✨ (@salman_ka_abhi) October 8, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..