Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“ఎన్నికల్లో గెలిస్తే గ్రామంలో మూడు విమానాశ్రయాలు.. రూ.20కే లీటర్ పెట్రోల్”.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టర్..

నేటి కాలంలో, ఎన్నికల్లో గెలవడం కంటే పెద్ద పర్వతాన్ని ఎత్తడం చాలా సులభమని భావించవచ్చు. ఎంపీ-లేదా ఎమ్మెల్యే లేదా సర్పంచ్ గా ఎన్నిక ఏదైనా కావచ్చు. కానీ అందులో గెలుపు సాధించడం అంత సులువైన పనేమీ కాదు...

ఎన్నికల్లో గెలిస్తే గ్రామంలో మూడు విమానాశ్రయాలు.. రూ.20కే లీటర్ పెట్రోల్.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టర్..
Electiion Promices
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 11, 2022 | 12:02 AM

నేటి కాలంలో, ఎన్నికల్లో గెలవడం కంటే పెద్ద పర్వతాన్ని ఎత్తడం చాలా సులభమని భావించవచ్చు. ఎంపీ-లేదా ఎమ్మెల్యే లేదా సర్పంచ్ గా ఎన్నిక ఏదైనా కావచ్చు. కానీ అందులో గెలుపు సాధించడం అంత సులువైన పనేమీ కాదు. విజయం సాధించేందుకు చిత్ర విచిత్రమైన వాగ్దానాలు, హామీలు ఇస్తుంటారు. అవి ఆచరణకు సాధ్యం అవుతాయా లేదా అనే విషయాన్ని అస్సలూ పట్టించుకోరు. చాలా మంది అభ్యర్థులు ఎన్నికల్లో గెలుపొందడానికే వాగ్దానాలు చేసినా, గెలిచిన తర్వాత వాటిని నెరవేర్చడం వారికి సాధ్యం కాదు. అలాంటి ఒక అభ్యర్థి వాగ్దానాల వింత జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్ ప్రకారం.. సిర్సాద్ గ్రామం నుంచి సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థి భాయి జైకరన్ లత్వాల్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నెరవేర్చాల్సిన హామీల సుదీర్ఘ జాబితాను ప్రజలకు వివరించారు. అందులో మొత్తం 13 వాగ్దానాలు చేశారు. అయితే అవన్నీ ఆచరణయోగ్యమైనవిగా కనిపించడం లేదు.

ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత గ్రామంలో మూడు విమానాశ్రయాలు నిర్మిస్తామని, మహిళలకు మేకప్‌ కిట్‌ ఉచితంగా ఇస్తామని, సిర్సాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.20కి, ఒక్కొక్కరికి ఒక్కో బైక్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. మాదకద్రవ్యాలకు బానిసలైన వారికి రోజుకు ఒక బాటిల్ మద్యం ఇస్తానన్నారు. సిర్సాద్ నుంచి గోహనా వరకు ప్రతి 5 నిమిషాలకు హెలికాప్టర్ సౌకర్యం అందుబాటులో తీసుకువస్తానన్నారు. GST రద్దు చేసి, గ్యాస్ ధర సిలిండర్‌కు రూ.100, సిర్సాద్ నుంచి ఢిల్లీ వరకు మెట్రో లైన్, ఉచిత వైఫై సౌకర్యం, యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఈ వింత వాగ్దానాలతో కూడిన పోస్టర్‌ను ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకున్నారు. ‘నేను ఈ గ్రామానికి మారుతున్నాను’ అని ఫన్నీ క్యాప్షన్ ఇచ్చారు. యూజర్లు ఈ పోస్టర్‌ను చూసి చాలా ఆనందిస్తున్నారు. ‘పోటీ లేకుండానే ఎన్నుకోవాలి’ అని కొందరంటే, ‘ఎక్కువ పోటీ ఉండాలి. అప్పుడే ఇంత పెద్ద వాగ్దానాలు నెరవేరతాయని’ తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..