ఐదేళ్లుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడిన మహిళ.. చెక్ చేసి.. డాక్టర్లు స్కానింగ్ చేయగా..

తాజాగా ఆ కోవకు చెందిన ఓ ఘటన కేరళలోని కోజికొడ్‌లో జరిగింది. కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన మహిళకు సర్జరీ చేసి..

ఐదేళ్లుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడిన మహిళ.. చెక్ చేసి.. డాక్టర్లు స్కానింగ్ చేయగా..
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 10, 2022 | 8:17 PM

వైద్యులను దేవుళ్లుగా భావిస్తారు ప్రజలు. వారికి చేతులెత్తి మొక్కుతారు. అలాంటి వైద్యుల్లో కొందరు.. వారి నిర్లక్ష్యం కారణంగా రాక్షసులుగా మారతారు. తాజాగా ఆ కోవకు చెందిన ఓ ఘటన కేరళలోని కోజికొడ్‌లో జరిగింది. కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన మహిళకు సర్జరీ చేసి ఆమె కడుపులో కత్తెర పెట్టి కుట్టేశారు.

వివరాల్లోకి వెళ్తే.. కోజికొడ్‌కు చెందిన 30ఏళ్ల హ‌ర్షినా ఐదు సంవ‌త్సరాలుగా క‌డుపు నొప్పితో బాధ‌ప‌డుతోంది. గత ఆరు నెలలుగా నొప్పి మ‌రింత ఎక్కువ కావ‌డంతో.. తగ్గడానికి వైద్యులు ఆమెకు బలమైన యాంటీ బయోటిక్స్ ఇచ్చారు. అయినా ఏమాత్రం ప్రయోజనం లేకపోవడంతో ఇటీవ‌ల ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లింది. డాక్టర్లు ఆమెకు స్కానింగ్ చేసి, కడుపులో 11 సెంటిమీటర్ల పొడవు క‌త్తెర‌ ఉన్నట్టు గుర్తించారు.

ఆ ఫోర్సెప్స్ ఐదేళ్లుగా హ‌ర్షినా క‌డుపులో ఉన్నాయి. వాటిని అలా వ‌దిలేసింది కూడా ఇదే కోజికోడ్ మెడిక‌ల్ కాలేజీ వైద్యులు కావ‌డం మ‌రో విశేషం. ఫోర్సెప్స్ అనేది శస్త్రచికిత్సల సమయంలో రక్తస్రావ నాళాలను బిగించడానికి సర్జన్లు ఉపయోగించే కత్తెర లాంటి పరికరం. హ‌ర్షినా 2017లో కోజికోడ్ మెడికల్ కాలేజీలో మూడోసారి సిజేరియన్ చేయించుకుంది. అంతకుముందు రెండు ప్రైవేట్ ఆసుపత్రుల్లో స‌ర్జరీ చేయించుకున్నాన‌ని ఆమె చెప్పింది. “మూడవ శస్త్రచికిత్స తర్వాత, తనకు తీవ్రమైన నొప్పి మొద‌లైందని, లోహపు వస్తువు తన మూత్రాశయాన్ని గుచ్చుతూ, నొప్పి భరించలేనిదిగా మారిందని చెప్పింది. అని ఆమె తెలిపింది.

దీంతో ఆమె ప్రభుత్వ వైద్య కళాశాలను ఆశ్రయించగా వైద్యులు శస్త్రచికిత్స చేసి ఫోర్సెప్స్ తీసివేశారు. ఐదేళ్ల క్రితం సర్జరీ చేస్తుండగా శరీరంలో ఫోర్సెప్స్ వదిలేశారని డాక్టర్లపై హర్షినా ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుపై కేరళ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అక్టోబరు 8న విచారణకు ఆదేశించారు. త్వరలో నివేదిక సమర్పించాలని ఆరోగ్య కార్యదర్శిని కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. కోజికోడ్ మెడికల్ కాలేజీ కూడా విచారణకు ఆదేశించింది. (Source)