Pawan Kalyan: ఈ నెల 15 నుంచి జనంలోకి జనసేన.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనవాణి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మళ్ళీ జనసేనాని జనంలోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ శ్రేణులు ఒక ప్రకటన విడుదల చేశాయి.
15వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన.. 16న ఉత్తరాంధ్ర జిల్లాల జనవాణి కార్యక్రమం.. ఈ పర్యటనలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకులతో, పార్టీ వాలంటీర్లతో సమావేశాలు.. 15, 16, 17 తేదీల్లో ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నాయకులతో సమీక్షలు.. జనసేన భవిష్యత్తు కార్యాచరణ పై పార్టీ నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న పవన్ కళ్యాణ్..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యల గురించి స్వయంగా అడిగి తెలుసుకోవడం కోసం జనవాణి కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. వివిధ ప్రాంతాల్లోని ప్రజల దగ్గరకు వెళ్తూ.. స్వయంగా వారి సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తాజాగా మళ్ళీ జనసేనాని జనంలోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ శ్రేణులు ఒక ప్రకటన విడుదల చేశాయి.
ఈ నెల 15 వ తేదీ నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకులతో, పార్టీ వాలంటీర్లతో సమావేశాలు నిర్వహించనున్నారు. 15, 16, 17 తేదీల్లో ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నాయకులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ జనసేన భవిష్యత్తు కార్యాచరణ పై పార్టీ నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
షెడ్యూల్ వివరాలు:
ఈ నెల 15 తేదీన పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటన
16న ఉత్తరాంధ్ర జిల్లాల జనవాణి కార్యక్రమం
17 తేదీలో శ్రీకాకుళం జిల్లాల నాయకులతో సమీక్ష
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..