AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cow National Animal: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని పిటిషన్‌ .. స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకాతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌ గోవంశ్‌ సేవా సదన్‌తో మాట్లాడుతూ.. ఇలాంటి విషయాలను నిర్ణయించడం కోర్టు పని కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Cow National Animal: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని పిటిషన్‌ .. స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
Cow National Animal
Surya Kala
|

Updated on: Oct 10, 2022 | 4:09 PM

Share

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని చాలా కాలం నుంచి దేశ వ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. గో సంరక్షణను హిందువుల ప్రాథమిక హక్కుగా భావించాలని అనేక ధార్మిక సంస్థలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆవును జాతీయ జంతువుగా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సోమవారం నిరాకరించింది.

జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకాతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌ గోవంశ్‌ సేవా సదన్‌తో మాట్లాడుతూ.. ఇలాంటి విషయాలను నిర్ణయించడం కోర్టు పని కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టికల్ 32 కింద దాఖలు చేస్తున్నట్లు చెప్పిన ఈ పిటిషన్ ఎవరి ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నదనేది స్పష్టం చేయకపోవడం విచారకరమని పేర్కొన్నది.

“ఇది కోర్టు పని కాదు..  మేము జరిమానా విధించాల్సిన అవసరమున్న ఇటువంటి పిటిషన్లను ఎందుకు దాఖలు చేస్తారని అసహనం వ్యక్తం చేసింది. ఇక నుంచి ఇటువంటి పిటిషన్లు దాఖలు చేసి.. విలువైన కోర్టు సమయాన్ని వృధా చేయవద్దామని మందలించింది.  చట్టాన్ని గాలికి విసిరివేస్తారా?” అని పిటిషన్ దారులను కోర్టు ప్రశ్నించింది.

ఇవి కూడా చదవండి

అయితే  పిటిషనర్ తరఫు న్యాయవాది సమాధానమిస్తూ.. గోసంరక్షణ అనేది చాలా ముఖ్యమైన అంశమని తెలిపారు. “ప్రభుత్వం ఈ విషయాన్నీ పరిగణించనివ్వండి. తాము గో రక్షణ, జాతీయ జంతువు విషయంలో బలవంతం చేయడం లేదని తెలిపారు. మనం  ఆవుల నుండి  అనేక ప్రయోజనాలు పొందుతున్నామని చెప్పారు. అయితే, ఈ పిటిషన్‌ను స్వీకరించడానికి కోర్టు నిరాకరించింది. లేనిపక్షంలో పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తామని పేర్కొన్నది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..