Cleanest City in India: వరసగా ఆరోసారి క్లినెస్ట్ సిటీగా ఇండోర్.. మిఠాయిలు పంచి పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

స్వచ్ఛత ర్యాంకింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచిన నగరవాసులకు లడ్డూ పంపిణీ చేశారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా పారిశుధ్య కార్మికుల శ్రమ వల్లే ఇండోర్ స్వచ్ఛతలో వరుసగా ఆరోసారి నంబర్ వన్‌గా నిలిచిందని బీజేపీ నేత మనోజ్ మిశ్రా అన్నారు.

Cleanest City in India: వరసగా ఆరోసారి క్లినెస్ట్ సిటీగా ఇండోర్.. మిఠాయిలు పంచి పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం
Indore Declared Cleanest Ci
Follow us
Surya Kala

|

Updated on: Oct 02, 2022 | 7:25 PM

దేశంలోని అన్ని నగరాలను వెనక్కి నెట్టి ఇండోర్ మరోసారి పరిశుభ్రతలో నంబర్ వన్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ నగరం ఆరోసారి పరిశుభ్రతలో మొదటి స్థానంలో నిలిచింది. నగర పరిశుభ్రత ర్యాంకింగ్ పట్ల నగర వాసులు సంతోషం వ్యక్తం చేశారు. పలు చోట్ల ప్రజలు మిఠాయిలు పంచి, పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ఇండోర్‌లోని బడా గణపతి కూడలిలో భారీ కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ పరిశుభ్రత పాటలపై బాలికలు సందడి చేశారు. ఈ సమయంలో, కొంతమంది పిల్లలు ఇతర నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చారు.

స్వచ్ఛత ర్యాంకింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచిన నగరవాసులకు లడ్డూ పంపిణీ చేశారు. బీజేపీ సీనియర్ నేత మనోజ్ మిశ్రా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా పారిశుధ్య కార్మికుల శ్రమ వల్లే ఇండోర్ స్వచ్ఛతలో వరుసగా ఆరోసారి నంబర్ వన్‌గా నిలిచిందని బీజేపీ నేత మనోజ్ మిశ్రా అన్నారు. ఇండోర్ పరిశుభ్రతలో విషయంలో నంబర్ వన్ గా నిలవడానికి కారణం నిరంతరం శ్రమ పడుతున్న పారిశుధ్య కార్మికులేనని అన్నారు. ఎందుకంటే వారు  ఇండోర్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

నగర ప్రజలకు కూడా పరిశుభ్రతపై అవగాహన: ఎవరైనా చెత్తాచెదారాన్ని ఆరు బయట లేదా ఎక్కడ బడితే అక్కడ వేస్తే దాన్ని అరికట్టేందుకు కృషి చేస్తామని ఇండోర్ వాసులు చెబుతున్నారు. దీని ఫలితంగానే నేడు దేశంలోని అన్ని నగరాలను వెనక్కి నెట్టి ఇండోర్ నంబర్ వన్‌గా నిలిచింది. దీనితో పాటు, ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా నగరం పరిశుభ్రతకు సంబంధించి అనేక ప్రయత్నాలు చేసింది. రాబోయే రోజుల్లో ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రచారాన్ని ప్రారంభించనున్నామని తెలిపింది.

ఇవి కూడా చదవండి

స్వచ్ఛ సర్వేక్షణ్ ఫలితాలు వెల్లడి: స్వచ్ఛతా సర్వేక్షణ్ 2022 ఫలితాలు ప్రకటించబడ్డాయి. ఈసారి ఈ సర్వేలో 4355 నగరాలను చేర్చారు. అత్యంత పరిశుభ్రత (1 లక్ష కంటే ఎక్కువ జనాభా) ఉన్న నగరాల్లో ఇండోర్ మొదటి స్థానంలో నిలిచింది. అదే సమయంలో, దేశవ్యాప్తంగా 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 40 నగరాల్లో రాజస్థాన్‌లోని రెండు పట్టణ సంస్థలు చేర్చబడ్డాయి. జైపూర్‌లో మున్సిపల్ కార్పొరేషన్ హెరిటేజ్ 26వ స్థానం, మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ 33వ స్థానంలో నిలిచాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..