Navaratri 2022: దసరాపండగ అంటే అంతే మరి.. అమ్మవారి దర్శనం కోసం భారీ వర్షంలో గొడుగులు వేసుకుని క్యూలో జనం

వర్షాల వలన  కోల్‌కతాతో సహా అనేక జిల్లాలోని మండపాలు నీటితో నిండిపోయాయి.  అయితే వర్షాలు ఎక్కడా భక్తుల ఉత్సాహాన్ని తగ్గించలేదు.  పూజా మండపాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు.

Navaratri 2022: దసరాపండగ అంటే అంతే మరి.. అమ్మవారి దర్శనం కోసం భారీ వర్షంలో గొడుగులు వేసుకుని క్యూలో జనం
Navaratri
Follow us

|

Updated on: Oct 02, 2022 | 6:50 PM

Navaratri 2022: దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఓ వైపు ఢిల్లీ నుంచి గల్లీ వరకూ మండపాలు ఏర్పాటు చేసి.. అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజాదికార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరో వైపు అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ జనజీవనాన్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది. దుర్గాపూజను అత్యంత ఘనంగా నిర్వహించే పశ్చిమ బెంగాల్‌లో ఓ వర్షం కురుస్తోంది. దుర్గా పూజ మహాషష్టి రోజున కోల్‌కతాలో .. అనేక జిల్లాల్లో చెదురుమదురుగా వర్షం ప్రారంభమైంది. వర్షాల వలన  కోల్‌కతాతో సహా అనేక జిల్లాలోని మండపాలు నీటితో నిండిపోయాయి.  అయితే వర్షాలు ఎక్కడా భక్తుల ఉత్సాహాన్ని తగ్గించలేదు.  పూజా మండపాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ప్రజలు గొడుగులు పట్టుకుని వర్షంలో పూజాపండల దర్శిస్తూ.. సందడి చేస్తున్నారు. మహా సప్తమి రోజున హౌరా, సౌత్ 24 పరగణాలు, బంకురా, బీర్భమ్, వెస్ట్ బుర్ద్వాన్ సహా పలు జిల్లాల్లో 2 నుంచి 3 గంటల్లో వర్షాలు కురుస్తాయని అలీపూర్ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదిలా ఉండగా, పూజలో రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఈ రాత్రి నుంచి మరిన్ని మెట్రో రైళ్లను నడపాలని నిర్ణయించారు.

వాతావరణ శాఖ ప్రకారం.. తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని.. అయితే దీని ప్రభావం బెంగాల్‌పై పెద్దగా ప్రభావం చూపదని పేర్కొంది. అయితే, రానున్న 24 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈశాన్య దిశగా మరో తుఫాను ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ బెంగాల్‌లో పూజల సమయంలో ఈ జంట తుఫానుల ప్రభావం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖా వెల్లడించింది.

మహా సప్తమి నుంచి రాత్రంతా మెట్రో సర్వీసులు: మరోవైపు, మెట్రో రైలు ఓ  ప్రకటన చేసింది. నేటి సప్తమి నుండి రాత్రంతా మెట్రో సేవలు మరింత సమయంలో అందుబాటులో ఉంటాయని పేర్కొంది.  దసరా నవరాత్రుల సందర్భంగా మెట్రోలో రికార్డు స్థాయిలో ప్రయాణీకులు ప్రయాణించారని.. ఇప్పటి వరకూ వీరి సంఖ్య 7.5 లక్షలు దాటిందని తెలిపింది. మరోవైపు కోల్‌కతా మెట్రో నార్త్-సౌత్ బ్రాంచ్‌లో నవరాత్రుల్లో ఆరో రోజు సాయంత్రం రికార్డు స్థాయిలో రద్దీ నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..