AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navaratri 2022: నవరాత్రుల్లో కన్యా పూజ విశిష్టత.. నియమాలు.. ఏ వయసు బాలికను పూజిస్తే ఎలాంటి శుభ ఫలితం కలుగుతుందంటే..

నవరాత్రులలో పూజించబడే తొమ్మిది మంది బాలికల్లో రెండేళ్ల బాలిక కుమారి, మూడేళ్ల బాలిక..  త్రిమూర్తి,  నాలుగేళ్ల బాలిక .. కళ్యాణి,  ఐదేళ్ల బాలిక.. రోహిణి,  ఆరేళ్ల బాలిక.. కాళిక, ఏడేళ్ల బాలిక.. చండిక, ఎనిమిదేళ్ల బాలిక .. శాంభవి, తొమ్మిదేళ్ల బాలికను దుర్గగా, పదేళ్ల బాలికను సుభద్రగా పరిగణిస్తారు.

Navaratri 2022: నవరాత్రుల్లో కన్యా పూజ విశిష్టత.. నియమాలు.. ఏ వయసు బాలికను పూజిస్తే ఎలాంటి శుభ ఫలితం కలుగుతుందంటే..
Navaratri Kanya Puja
Surya Kala
|

Updated on: Oct 02, 2022 | 9:31 PM

Share

ఆశ్వయుజ మాసంలో వచ్చే శారదీయ నవరాత్రుల్లో శక్తి ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. నవరాత్రులు తొమ్మిది రోజుల్లో దుర్గాదేవిని తొమ్మిది రూపాలుగా ఆరాధిస్తారు. అమ్మవారికి చిహ్నంగా భావించి 09 మంది బాలికలకు ప్రత్యేక పూజలను చేసే సంప్రదాయం చాలా ప్రాంతాల్లో ఉంది. నవరాత్రులలో అమ్మవారి స్వరూపంగా భావిస్తూ.. తొమ్మిది రోజులు ఒకొక్క బాలికను కొందరు పూజిస్తారు. మరికొందరు నవరాత్రుల ముగింపు రోజున అష్టమి లేదా నవమి నాడు తమ ఇంట్లో 09 మంది అమ్మాయిలను పిలిచి పూజిస్తారు. ఈ సంవత్సరం అష్టమి 03 అక్టోబర్ 2022 న వచ్చింది.  నవమి తేదీ 04 అక్టోబర్ 2022 న వచ్చింది. నవరాత్రుల్లో ఏ వయసులో ఉన్న అమ్మాయిని పూజిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో. పూజ విధానం పూర్తిగా తెలుసుకుందాం.

ఏ వయసు బాలిక ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటుందంటే..

నవరాత్రులలో పూజించబడే తొమ్మిది మంది బాలికల్లో రెండేళ్ల బాలిక కుమారి, మూడేళ్ల బాలిక..  త్రిమూర్తి,  నాలుగేళ్ల బాలిక .. కళ్యాణి,  ఐదేళ్ల బాలిక.. రోహిణి,  ఆరేళ్ల బాలిక.. కాళిక, ఏడేళ్ల బాలిక.. చండిక, ఎనిమిదేళ్ల బాలిక .. శాంభవి, తొమ్మిదేళ్ల బాలికను దుర్గగా, పదేళ్ల బాలికను సుభద్రగా పరిగణిస్తారు.

ఇవి కూడా చదవండి

నవరాత్రులలో కన్యా పూజ ఫలం: రెండేళ్ల బాలికను పూజిస్తే దారిద్య్రం తొలగిపోతుందని, మూడేళ్ల బాలికను పూజించడం వల్ల సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయని నమ్ముతారు. నాలుగు సంవత్సరాల బాలికను పూజించడం వలన సాధకుని జీవితానికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి.. ఐదేళ్ల బాలికను పూజించడం వలన  శరీరంలోని రుగ్మతలు తగ్గుతాయని..  దుఃఖ తొలగుతుందని విశ్వాసం. ఆరేళ్ల బాలిక్కి పాదపూజ చేయడం ద్వారా సాధకుడికి విద్య, విజయం లభిస్తాయని, ఏడేళ్ల బాలికను పూజించడం వల్ల గౌరవం, ఐశ్వర్యం లభిస్తాయని విశ్వాసం. అదేవిధంగా ఎనిమిదేళ్ల బాలికకు పూజలు చేయడం.. వివాదాలు పరిష్కారం అవుతాయని..  కోర్టు-కోర్టు కేసుల్లో విజయం లభిస్తుందని నమ్మకం. తొమ్మిదేళ్ల బాలికను పూజించడం ద్వారా కష్టమైన పనులు రెప్పపాటులో పూర్తవుతాయి. పదేళ్ల బాలికను పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి.

కన్యా పూజకు ముఖ్యమైన నియమాలు

  1. కన్యా పూజ కోసం అమ్మాయిలను సగౌరవంగా మీ ఇంటికి ఆహ్వానించండి .. వారిని గౌరవంగా పంపించండి.
  2. కన్యా పూజ కోసం 02 నుండి 10 సంవత్సరాల వయస్సు గల బాలికలను ఆహ్వానించాలి. 09 మంది బాలికలు ఉండాలి.
  3. నవరాత్రులలో ఆడపిల్లలతో పాటు చిన్న బాలుడిని కూడా తప్పనిసరిగా ఆహ్వానించాలి.. భైరవుని రూపంలో ఆ బాలుడిని భావించి.. బాలికలతో పాటు పూజించాలి.
  4. మీరు మీ నమ్మకం ప్రకారం అష్టమి లేదా నవమి తిథి నాడు కన్యా పూజ చేయవచ్చు.
  5. బాలికను పూజించే ముందు, ఆమె పాదాలను కడిగి, తుడిచి..  శుభ్రమైన ఆసనంపై కూర్చోబెట్టి, ఆచార పూజలు చేసి, ఆ తర్వాత  ఆ బాలికకు ఖీర్, పాయసం, పూరీ మొదలైనవి తినడానికి ఇవ్వాలి.
  6. బాలికలను పూజించిన తరువాత, అమ్మాయిలను విడిచిపెట్టేటప్పుడు బహుమతులు లేదా డబ్బులను ఇవ్వండి. అమ్మాయిలను తిరిగి పంపించే ముందు వారినుంచి ఆశీస్సులు తీసుకోవడం మర్చిపోవద్దు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)