Minister Roja: మంచిని మెచ్చని పవన్ కళ్యాణ్ కుంభకర్ణుడంటూ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు..
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని అభివృద్ధి చేయకుండా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం నష్టం చేస్తున్నామని మాట్లాడటం బాధాకరమన్నారు. అసలు అమరావతి ఉద్యమం కాదు.. అత్యాశాపరుల ఉద్యమం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తిరుమల శ్రీవారిని పర్యాటక శాఖ మంత్రి రోజా దర్శించుకుని తన మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం అర్చకులు మంత్రి రోజాను ఆశీర్వదించి స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందచేసారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి రోజా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై ఘాటుగా విమర్శలు చేశారు. అంతేకాదు మూడు రాజధానులను అభివృద్ధి చేయాలని తండ్రి మనస్సుతో సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానులపై ప్రాంతాలను రెచ్చగొట్టేవిధంగా టీడీపీ నాయకులు నానా యాగీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. 29 గ్రామాల కోసం 26 జిల్లాలను పణంగా పెట్టాలంటే ఎవ్వరూ ఒప్పుకోరని తెలిపారు. చంద్రబాబుకు అమరావతిపై ప్రేమ ఉంటే ఎందుకు అభివృద్ధి చేయలేదని మంత్రి రోజా ప్రశ్నించారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని అభివృద్ధి చేయకుండా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం నష్టం చేస్తున్నామని మాట్లాడటం బాధాకరమన్నారు. అసలు అమరావతి ఉద్యమం కాదు.. అత్యాశాపరుల ఉద్యమం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాలు పన్నులు కట్టేటప్పుడు.. 26 జిల్లాలు అభివృద్ధి చెందాలని కోరుకోవడంలో తప్పేంటని ప్రశ్నించారు. అమరావతి రైతులు వైజాగ్ కు పాదయాత్రగా వెళ్లడం అక్కడి ప్రజలను రెచ్చగొట్టేందుకే అంటూ ఆరోపణలు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు, నారా లోకేష్ లు ఇలాంటి కార్యక్రమాలు పెడుతున్నారని వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ కుంభకర్ణుడిగా 6 నెలలు నిద్ర పోతాడు, 6 నెలలు మేలుకొంటాడు.. ప్రజలు అభిమానించే స్టార్ గా పవన్ కళ్యాన్ ప్రజలకు ఏంచేశాడో చెప్పాలంటూ ప్రశ్నించారు మంత్రి రోజా. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు దత్తపుత్రుడు.. టీడీపీ, బీజేపీలకు ఓటేయమని తిరిగినప్పుడు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు కనిపించలేదా అన్నారు రోజా.
ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు వలసలు పోతున్నారని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం విచిత్రంగా ఉందని.. అసలు ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరిగింది వైఎస్ఆర్, జగన్ హాయాంలలోనే అన్నారు. గతంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయొలని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు.. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్న పవన్ కళ్యాన్ కు ఏ ప్యాకేజీ అందిందో చెప్పాలని డిమాండ్ చేశారు రోజా.
చంద్రబాబు బినామీ లింగమనేని పవన్ కళ్యాణ్ కు భూమిలిచ్చాడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడా? అసలు పార్టీ పెట్టడం కాదు సీరియస్ పొలిటీషియన్ గా నిలబడి మంచిని ఆహ్వానించాలన్నారు.. రోజుకో మాట, పూటకో వేషం వేస్తే ప్రజలు పవన్ కళ్యాణ్ ను కొడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా..
మరోవైపు తిరుమలలో భక్తుల పెరిగిన రద్దీ పెరిగింది. శిలాతోరణం వరకు మూడున్నర కిలో మీటర్ల మేర క్యూ లైన్ ఉంది. వైకుంఠం రెండు కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు అన్నీ భక్తులతో నిండుకున్నాయి. శ్రీవారి దర్శనానికి భక్తులకు 24 గంటల సమయం పడుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..