Dussehra: లక్ష్మణుడికి జ్ఞానం అందించిన 5 రోజులకు రావణుడు మరణం.. అక్కడ 200 ఏళ్లుగా దసరాకు విశిష్ట సంప్రదాయం..

దసరా పర్వదినం తర్వాత వచ్చే శరత్ పూర్ణిమ రోజున.. రావణుని తన జీవితాన్ని విడిచి పెట్టాడు. దీని కారణంగా 200 సంవత్సరాలకు పైగా కన్నౌజ్ జిల్లాలో దసరా ఐదవ రోజున శరత్ పూర్ణిమ నాడు రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు.

Dussehra: లక్ష్మణుడికి జ్ఞానం అందించిన 5 రోజులకు రావణుడు మరణం.. అక్కడ 200 ఏళ్లుగా దసరాకు విశిష్ట సంప్రదాయం..
Dussehra Interesting Story
Follow us
Surya Kala

|

Updated on: Oct 07, 2022 | 9:44 AM

దేశవ్యాప్తంగా దసరా సంబరాలు అంబరాన్ని తాకాయి. తమ తమ సంస్కృతి, సంప్రదాయాలను అనుసరించి విజయదశమి వేడుకలను జరుపుకున్నారు. రావణాసుడి దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ జిల్లాలో దసరా పర్వదినం వేడుకల మాత్రం భిన్నంగా జరుగుతాయి. లంకాపతి రావణుడి దిష్టిబొమ్మను దహనం దసరా పండగ తర్వాత జరుపుతారు. ఈ సంప్రదాయం సుమారు 200 ఏళ్లుగా కొనసాగుతుంది. అక్కడ ప్రజల నమ్మకం ప్రకారం.. లంకాపతి రావణుడు దసరా రోజున తన ప్రాణాలను విడిచి పెట్టలేదు. దసరా పర్వదినం తర్వాత వచ్చే శరత్ పూర్ణిమ రోజున.. రావణుని తన జీవితాన్ని విడిచి పెట్టాడు. దీని కారణంగా 200 సంవత్సరాలకు పైగా కన్నౌజ్ జిల్లాలో దసరా ఐదవ రోజున శరత్ పూర్ణిమ నాడు రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు.

పురాణాల ప్రకారం..  శ్రీరాముడు, లంకాపతి రావణుడి మధ్య యుద్ధం జరిగినప్పుడు, విభీషణుడి ఆదేశం మేరకు, శ్రీరాముడు రావణుడి నాభిలో ఒక బాణం వేయగా.. అతని నాభి నుండి అమృతం వెలువడింది. ఆ తర్వాత సుమారు 5 రోజుల పాటు రావణుడి ప్రాణం విడిచిపెట్టలేదు. రాముడి బాణం తగిలిన తరువాత.. రావణుడు ఆకాశం నుండి స్పృహతప్పి నేలపై పడిపోయినప్పుడు, శ్రీరాముడు తన తమ్ముడు లక్ష్మణునితో రావణుడు గొప్ప జ్ఞాని.. నీవు వెళ్లి అతని నుండి జ్ఞానాన్ని తీసుకో అని చెప్పాడు.

200 ఏళ్ల నాటి విశిష్ట ఆచారం శ్రీరాముని ఆజ్ఞను స్వీకరించిన తర్వాత లక్ష్మణుడు జ్ఞానాన్ని పొందేందుకు రావణుని వద్దకు వెళ్లాడు. రావణుడు లక్ష్మణునికి  జ్ఞానం అందించడానికి 5 రోజులు పట్టింది. ఆ తర్వాత శరత్ పూర్ణమి రోజున.. రావణుడు శ్రీరాముని పేరును తలచుకుంటూ తన ప్రాణాలను విడిచిపెట్టాడు. ఈ నమ్మకాన్ని నమ్ముతూ కనౌజ్ జిల్లాలో రావణుడిని వధించి దహనం చేసే ఆచారం 200 ఏళ్లకు పైగా కొనసాగుతోందని..  దీని కారణంగా దసరా రోజున రావణ దహనం జరగదని చెబుతారు. కన్నౌజ్ జిల్లాలో రెండు చోట్ల రావణ్ దహన్ నిర్వహిస్తారు. ఈ జిల్లాలో రెండు ప్రదేశాలలో దసరా తర్వాత వచ్చే శరత్ పూర్ణిమ రోజున రావణ దహనం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

శ్రీరాముని జీవిత చరిత్రను తెలిపే రామాయణం ఆధారంగా.. కన్నౌజ్‌లోని  ప్రజలు రాంలీలను జరుపుకుంటారు. ఈ సంప్రదాయం 200 ఏళ్ల నుంచి సాగుతూనే ఉంది. అనేక ప్రాంత ప్రజలు ఈ పండగ కోసం ఒక సంవత్సరం పాటు వేచి ఉంటారు. భక్తులు రామలీలాను వీక్షించిన తర్వాత భగవంతుడు శ్రీరాముని భక్తిలో మునిగిపోతారు. భగవంతుని స్తుతులతో ఎంతో ఆనందంగా రావణ దహనాన్ని జరుపుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..