Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. వరుస సెలవుల ఎఫెక్ట్.. కొండ నిండా భక్తజనం.. దర్శనానికి 36 గంటల సమయం..

గోవింద నామ స్మరణతో తిరుమల గిరులు మారుమ్రోగుతున్నాయి. ప్రస్తుతం కొండమీద ఏ రేంజ్ లో భక్తులు ఉన్నారంటే.. ఉచిత దర్శనం క్యూ లైను శిలా తోరణం వరకూ ఉందంటే మీరు ఊహించుకోవచ్చు.

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. వరుస సెలవుల ఎఫెక్ట్.. కొండ నిండా భక్తజనం.. దర్శనానికి 36 గంటల సమయం..
Tirumala Rush
Follow us
Surya Kala

|

Updated on: Oct 07, 2022 | 8:21 AM

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతిలో భారీగా భక్తుల రద్దీ నెలకొంది. తిరుమల కొండ నిండా భక్తజనంతో సందడి సందడిగా ఉంది. తమిళులకు ఇప్పుడు ఎంతో పవిత్రమైన పెరటాసి మాసం..  దీంతో తమిళనాడు భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి పోటెత్తుతున్నారు. మరోవైపు దసరా సెలవులతో పాటు.. ఉద్యోగులకు వరస సెలవులు రావడంతో భక్తుల రద్దీతో కొండా కిక్కిరిసి పోయింది. గోవింద నామ స్మరణతో తిరుమల గిరులు మారుమ్రోగుతున్నాయి. ప్రస్తుతం కొండమీద ఏ రేంజ్ లో భక్తులు ఉన్నారంటే.. ఉచిత దర్శనం క్యూ లైను శిలా తోరణం వరకూ ఉందంటే మీరు ఊహించుకోవచ్చు. క్యూ లైన్లు, మాడ వీధులు, లడ్డు కౌంటర్లు, అఖిలాండం, అన్నప్రసాదం, ఉచిత సత్రాలు, కళ్యాణ కట్ట, బస్టాండ్ ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు.

వైకుంఠం 1, 2 లోని అన్ని కంపార్ట్మెంట్లతోపాటునారాయణగిరి షెడ్ల లోనూ స్వామివారి భక్తులు నిండిపోయారు. వెంకన్న దర్శనం కోసం రింగ్ రోడ్డులోని శ్రీవారి సేవా సదన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర ఉన్న క్యూ లైన్.. దీంతో సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు దాదాపు 36 గంటలు సమయం పడుతోంది. దర్శనం కోసం క్యూ లైన్ లో ఎదురుచూస్తున్న భక్తులకు అసౌకర్యం కలగకుండా టిటిడి ఏర్పాట్లు చేస్తోంది. అయితే ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి వెళ్లే పిల్లలు, వృద్దులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తగు జాగ్రత్తలు తీసుకుని వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు.

బుధవారం ఒక్కరోజునే శ్రీవారిని  72195 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల కానుకల ద్వారా హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో 2.17 కోట్ల రూపాయలు లభించింది. ఒక్కరోజే 41071 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?