Telangana CID Officer: తెలంగాణ సీఐడీ ఆఫీసర్‌ కారు బోల్తా.. అక్కడికక్కడే ఆయన భార్య మృతి!

తెలంగాణ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (సీఐడీ) డీజీ గోవింద్ సింగ్ భార్య సోమవారం (అక్టోబర్‌ 10) కారు ప్రమాదంలో మృతి చెందారు. డీజీ గోవింద్ సింగ్‌తోపాటు ఆయన భార్య షీలా సింగ్‌, మరో ఇద్దరు.. మొత్తం నలుగురు వ్యక్తులతో వెళ్తున్న కారు..

Telangana CID Officer: తెలంగాణ సీఐడీ ఆఫీసర్‌ కారు బోల్తా.. అక్కడికక్కడే ఆయన భార్య మృతి!
CID Director General Govind Singh
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 10, 2022 | 7:59 PM

తెలంగాణ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (సీఐడీ) డీజీ గోవింద్ సింగ్ భార్య సోమవారం (అక్టోబర్‌ 10) కారు ప్రమాదంలో మృతి చెందారు. డీజీ గోవింద్ సింగ్‌తోపాటు ఆయన భార్య షీలా సింగ్‌, మరో ఇద్దరు.. మొత్తం నలుగురు వ్యక్తులతో వెళ్తున్న కారు బోల్తా పడింది. ఈ సంఘటనలో డీజీ గోవింద్ సింగ్‌తో సహా మరో ఇద్దరికి తీవ్ర గాయాలవగా, డీజీ భార్య మృతి చెందారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

సీనియర్ సీఐడీ అధికారి అయిన డీజీ గోవింద్ సింగ్‌, ఆయన భార్య షీలా సింగ్‌, మరో ఇద్దరు మధ్యాహ్నం 2.25 గంటలకు తనోత్ మాతా ఆలయాన్ని దర్శించుకుని, తిరిగి రామ్‌గఢ్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో తనోత్ మాతా దేవాలయం – రామ్‌ఘర్ మధ్య మార్గంలో వీరు ప్రయాణిస్తున్న కారు హఠాత్తుగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డీజీ భార్య షీలా సింగ్ అక్కడికక్కడే మృతి చెందగా.. డీజీ గోవింద్ సింగ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ విజయేందర్‌కు తీవ్రం గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బీఎస్‌ఎఫ్‌ జవాన్లు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని రామ్‌ఘర్‌లోని కమ్యునిటీ హెల్త్‌ కేర్‌ సెంటర్‌కు తరలించారు. డీజీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. డ్రైవర్‌, మరో వ్యక్తి పరిస్థితి విషయంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రమాదానికి గురైన కారు తీవ్రంగా డ్యామేజ్‌ అయినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.