Kanpur: ముక్కంటికి భక్తుడిగా మారిపోయిన మేక.. గర్భగుడి ముందు మోకాళ్ల మీద కూర్చొని ప్రార్థనలు.. షాకైన భక్తులు
తాజాగా ఓ మేక శివాలయంలో గర్భగుడి ముందు మోకరిల్లింది. మోకాళ్ల మీద కూర్చొని తలవంచుకుని దేవుడిని ప్రార్థించింది. దీంతో దేవాలయానికి వచ్చిన భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
మనుషులే కాదు కొన్ని మూగజీవాలకు కూడా దైవభక్తి ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని జంతువులు దేవుళ్లను ప్రార్థిస్తుండడం మనం చూసే ఉంటాం. ముఖ్యంగా ఆవులు, కోతులు, కుక్కలు, పాములు దేవుడి ముందు దండం పెట్టుకోవడం గతంలో చూశాం. సోషల్ మీడియాలో కూడా వీటికి సంబంధించిన వీడియోలు దర్శనమిస్తుంటాయి. అలా తాజాగా ఓ మేక శివాలయంలో గర్భగుడి ముందు మోకరిల్లింది. మోకాళ్ల మీద కూర్చొని తలవంచుకుని దేవుడిని ప్రార్థించింది. దీంతో దేవాలయానికి వచ్చిన భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు ఈ ఘటనను సెల్‌ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఉన్న ఆనందేశ్వర్ మందిరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా ఉదయం నుంచి ఆలయ ప్రాంగణంలో మేక కనిపిస్తోందని ఆలయానికి వచ్చిన భక్తురాలు లక్ష్మి తెలిపారు.
కాగా గంగా తీరం కావడంతో ఈ ఆలయ ప్రాంగణంలో ఆవులు, మేకలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ సాయంత్రం హారతి సమయంలో మేక భక్తిలో మునిగిపోయింది. భక్తులతో పాటు ఆలయంలోకి వచ్చిన హారతి సమయంలో వంగి నమస్కరించింది. గర్భగుడి ముందు మోకాళ్లపై కూర్చొని ప్రార్థనలు చేసింది. కాగా ఈ మేక ఇప్పుడు కాన్పూర్‌లో చర్చనీయాంశంగా మారింది. చాలామంది ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మేక ముక్కంటికి భక్తుడిగా మారిపోయిందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
एक आस्था ऐसी भी…. ? कानपुर में मंदिर के बाहर माथा टेकते हुए बकरे का वीडियो वायरल#Kanpur #UttarPradesh@myogioffice @myogiadityanath @BJP4UP pic.twitter.com/1FDhqbJCLB
— sweety dixit (@sweetydixit6) October 9, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..