Optical Illusion: పచ్చని ఆకుల మధ్యలో గుట్టుగా దాక్కున్న కప్ప.. 10 సెకన్ల టైమ్.. కనిపెట్టే సత్తా మీలో ఉందా..
మన కళ్లే మనల్ని మోసం చేస్తాయంటారు. ఎందుకంటే ఒక్కోసారి మనం చూసేది నిజమని నమ్మేలా ఉంటుంది. మన మనస్సును కన్‌ఫ్యూజ్ చేస్తుంది.
మన కళ్లే మనల్ని మోసం చేస్తాయంటారు. ఎందుకంటే ఒక్కోసారి మనం చూసేది నిజమని నమ్మేలా ఉంటుంది. మన మనస్సును కన్‌ఫ్యూజ్ చేస్తుంది. కానీ, తీక్షణంగా పరిశీలించి చూస్తే గానీ నిజం ఏంటో తెలియదు. అంత లాజిక్‌గా ఉంటాయి ఆప్టికల్ ఇల్యూజన్ పిక్స్. అందుకే చాలా మంది ఈ ఆప్టికల్ ఇల్యూజన్ పిక్స్‌కు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ ఫోటోల్లో దాగున్న వాటిని కనిపెట్టడంలో ఒక రకమైన మజా వస్తుంది. వినోదంతో పాటు, ఆలోచన శక్తి, సామర్థ్యం, సహనం పెంపొందించుకోవడంలో సహాయపడుతుంది. మెదడు పనితీరును మరింత చురుగ్గా మారుస్తుంది. అనేక అధ్యయనాలు సైతం ఈ విషయాన్ని నిర్ధారించాయి. అందుకే.. చాలా మంది ఆప్టికల్ ఇల్యూజన్ ఛాలెంజ్‌ను స్వీకరించి, వాటిని చేజ్ చేస్తుంటారు.
అయితే, తాజాగా ఓ ఆప్టికల్ ఇల్యూజన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో పచ్చని చెట్లు ఆకులు ఉన్నాయి. ఆ పచ్చని రంగులో కలిసి పోయేలా ఉన్న ఓ కప్ప ఆకుల మధ్య నక్కి ఉంది. అక్కడ కప్ప ఉందా? అనే సందేహం కలుగుతుంది. కానీ, ఆకుపై దర్జాగా సేద తీరుతూ కూర్చుంది. ఆకు రంగులో కలిసి పోయిన ఆ కప్పను కనిపెట్టాలంటూ ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు ఆ కప్ప ఎక్కడ ఉందో కనిపెట్టలేకపోయారు. కొందరు మాత్రం కనిపెట్టి కరెక్ట్ ఆన్సర్ చేశారు. మరి మీరేమైనా కనిపెట్టగలరా? లేదా? ట్రై చేయండి. 10 సెకన్ల వ్యవధిలో ఆ ఫోటోలో కప్ప ఎక్కడ ఉందో కనిపెట్టగలిగితే.. మీ మెదడు చాలా షార్ప్‌గా పని చేస్తుందని భావించొచ్చు.
మరెందుకు ఆలస్యం.. ఈ ఆప్టికల్ ఇల్యూజన్ పిక్‌ను కనిపెట్టి, మీ సత్తా చాటండి. ఒకవేళ మీకు కనిపించనట్లయితే.. చిన్న క్లూ కూడా ఇస్తున్నాం. అది ఒకల మలబార్ జంపింగ్ ఫ్రాగ్. చాలా చిన్నగా, గ్రీన్ కలర్‌లో ఉంటుంది. దాని కళ్లు పసుపు రంగులో మిళమిళ మెరుస్తుంటాయి. అయినా కనిపెట్టలేకపోయితే కింద ఫోటోలో కప్ప ఉన్న ప్లేస్‌ను రౌండ్ చేసి ఇవ్వడం జరిగింది. దానిని పరిశీలించవచ్చు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..