టిట్ ఫర్ టాట్ అంటే ఇదే.. మోసం చేయాలనుకుంటే ఇలానే మోసపోతారు.. జాగ్రత్త..

Ganesh Mudavath

Ganesh Mudavath |

Updated on: Oct 09, 2022 | 4:00 PM

సాధారణంగా రోడ్లపై వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన కొందరు కూరగాయలు, పండ్లు, వస్తువులు అమ్ముతుంటారు. కావాల్సిన వాళ్లు వెళ్లి కొనుక్కుంటారు. అయితే కొంత మంది మాత్రం తాము కొనుగోలు చేసే సమయంలో..

టిట్ ఫర్ టాట్ అంటే ఇదే.. మోసం చేయాలనుకుంటే ఇలానే మోసపోతారు.. జాగ్రత్త..
Merchant Cheating

సాధారణంగా రోడ్లపై వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన కొందరు కూరగాయలు, పండ్లు, వస్తువులు అమ్ముతుంటారు. కావాల్సిన వాళ్లు వెళ్లి కొనుక్కుంటారు. అయితే కొంత మంది మాత్రం తాము కొనుగోలు చేసే సమయంలో చేతివాటం చూపిస్తుంటారు. వ్యాపారికి తెలియకుండా వస్తువులు, సరకులను కొట్టేస్తుంటారు. ఇంటర్నెట్ లో చారా రకాల వీడియోలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆనందాన్ని కలిగించేవి అయితే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో అశ్చర్యం కలిగించక మానదు. ఇక్కడ ఒక వ్యక్తి రోడ్డు పక్కన వేరుశనగలు కొనుగోలు చేస్తుంటాడు. అయితే కొనుగోలు చేసేటప్పుడు తన తెలివిని చూపించడానికి ప్రయత్నిస్తాడు. కానీ వేరు శనగ అమ్మేవాడు అతని కంటే తెలివిగా మారిపోయాడు. అంతే కాకుండా అతను కూడా దారుణంగా మోసం చేస్తాడు .

చాలా మంది తమను తాము చాలా తెలివైన వారిగా భావిస్తుంటారు. ప్రతి ఒక్కరిపై ఈ స్మార్ట్‌నెస్‌ని చూపించడానికి ప్రయత్నిస్తారు. కానీ కొన్నిసార్లు ఈ స్మార్ట్‌నెస్ ఆ వ్యక్తులను ముంచెత్తుతుంది. ఈ రోజుల్లో అలాంటి తెలివైన వ్యక్తి యొక్క వీడియో వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి వేరుశనగను తూకం వేయమని అడిగాడు. అతను వేరు శనగను తూస్తున్న సమయంలో కుప్పలో నుంచి వేరు శనగను దొంగిలించి తన జేబులో వేసుకుంటాడు. ఇలా చాలాసార్లు చేశాడు.

View this post on Instagram

A post shared by memes comedy (@ghantaa)

ఇది దుకాణదారుడు చూశాడు. అతనికి సరైన బుద్ధి చెప్పాలని భావించి, వేరు శనగను సంచిలో వేసే సమయంలో కస్టమర్ కు మాయమాటలు చెప్పి సరకును కింద పడేస్తాడు. ఈ ఫన్నీ వీడియో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ అయింది. ఈ వీడియో మిలియన్ల కొద్దీ లైక్‌లు, వ్యూస్ సాధించింది. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్లు రూపంలో రాస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu